నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని బషీరాబాద్ లో సంక్రాంతి పర్వదినం సందర్భంగా స్థానిక బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ మేరకు ఆదివారం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో సంక్రాంతి ముగ్గుల పోటీల్లో తోపారం లక్షిత, నికిత మొదటి బహుమతి గెలుపొందగా, సుంకేట అంజలి రెండవ బహుమతి గెలుపొందారు.బాశెట్టి శ్రీ నిధి, మందుల లక్ష్మి, సక్కరం మహాన్వి, శ్రీకాంత్, కొత్తూర్ రాధా, నెల్ల చందన, బొంపెల్లి మేదిని మైత్రి, ఆకుల శరణ్య, తూటు వర్షిణి కన్సోలేషన్ బహుమతులు గెలుపొందారు. విజేతలకు గ్రామ సర్పంచ్ బైకన్ జమున మహేశ్వర్, ఉప సర్పంచ్ చిలివేరి భూమేష్, బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఏనుగు గంగా రెడ్డి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమం వార్డు సభ్యులు బందేల రాజు, అంకడి శేఖర్, నాయకులు బిఎన్ మోహన్, వంకాయల తిరుపతి, నల్ల ప్రశాంత్, శేఖర్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రధానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



