Thursday, September 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సాంప్రదాయ పద్ధతిలో నిమజ్జన చేసిన నిర్వాహకులకు బహుమతుల ప్రధానం

సాంప్రదాయ పద్ధతిలో నిమజ్జన చేసిన నిర్వాహకులకు బహుమతుల ప్రధానం

- Advertisement -

 నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలో వినాయక నిమజ్జనం సందర్భంగా సాంప్రదాయ పద్ధతిలో ఊరేగింపులు నిర్వహించిన వినాయక మండప నిర్వహకులకు హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బహుమతులను ప్రధానం చేశారు. మేరకు గురువారం మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్తమ వినాయక ఊరేగింపు మండపాల నిర్వాహకులకు బహుమతులను ప్రధానం చేశారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతి ప్రతిష్టించడంతోపాటు సాంప్రదాయ బద్ధంగా ఊరేగింపు నిర్వహించి, మంగళ హారతులతో  నిమజ్జన చేసిన మండప నిర్వహకులకు బహుమతులను ఎస్ఐ చేతుల మీదుగా అందజేశారు.మొదటి బహుమతి మాదిగ యూత్,

రెండవ బహుమతి గ్లోబల్ యూత్, మూడవ బహుమతి పద్మశాలి సంఘం, స్పెషల్ జ్యూరీ చత్రపతి యూత్ మండప నిర్వాహకులు గెలుచుకున్నారు. బహుమతులను గ్రామానికి చెందిన డాకూరి ఉదయ్ కుమార్ స్పాన్సర్ చేశారు. మండల కేంద్రంలోని 25 వినాయక మండపాల నిర్వాహకులను కండువాతో హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు సన్మానం చేయగా, పాటి హనుమాన్ బృందం  మెమొంటోతో సత్కరించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ అనిల్ రెడ్డి మాట్లాడుతూ  ఈ సంవత్సరం కమ్మర్ పల్లి గ్రామంలో   సాంప్రదాయ బద్ధంగా భజనలతో, మంగళహారతులతో భక్తి పాటలతో డీజే శబ్దాలు లేకుండా వినాయక ఊరేగింపు నిర్వహించడం బ్రహ్మాండంగా ఉందన్నారు. యువత చెడు ధోరణి వెళ్లకుండా భజనలతో వెళ్లిన వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి కార్యవర్గ సభ్యులు దొంతుల రమణయ్య, ఉట్నూర్ రాజశేఖర్, భోగ రామస్వామి, అమెడ నరేందర్, ఆమెటి శంకర్, అజయ్, అడిచర్ల రవీందర్, ధాత్రిక రాజ్ కుమార్, ఉట్నూర్  ధోని, యువకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -