Sunday, July 27, 2025
E-PAPER
Homeఆటలువైజాగ్‌లో ప్రొ కబడ్డీ లీగ్‌

వైజాగ్‌లో ప్రొ కబడ్డీ లీగ్‌

- Advertisement -

హైదరాబాద్‌ను వీడనున్న తెలుగు టైటాన్స్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌ :

స్పోర్ట్స్‌ హబ్‌గా ఎదుగుతున్న హైదరాబాద్‌లో క్రీడా పోటీల నిర్వహణకు పోటీపడుతున్న తరుణంలో పలు ప్రాంఛైజీలు నగరాన్ని వీడటం చర్చనీయాంశమైంది. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ ప్రాంఛైజీ హైదరాబాద్‌ ఎఫ్‌సీ యాజమాన్య మార్పుతో హైదరాబాద్‌ను వీడి న్యూఢిల్లీకి మారేందుకు రంగం సిద్ధం కాగా.. తాజాగా ప్రొ కబడ్డీ లీగ్‌ ప్రాంఛైజీ తెలుగు టైటాన్స్‌ సైతం హోమ్‌ గ్రౌండ్‌గా వైజాగ్‌ను ఎంచుకుంది. ప్రొ కబడ్డీ లీగ్‌ ఆగస్టు 29 నుంచి ఆరంభం కానుండగా.. తెలుగు టైటాన్స్‌ సొంత మైదానంగా విశాఖపట్నంను ఎంచుకోవటంతో లీగ్‌లో తొలి అంచె మ్యాచులు అక్కడే జరుగనున్నాయి. ‘వైజాగ్‌, హైదరాబాద్‌ రెండూ మాకు సొంత మైదానాలు. 2018 తర్వాత వైజాగ్‌లో పీకెఎల్‌ మ్యాచులు లేవు. టార్గెట్‌ రేటింగ్‌ పాయింట్లు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే, ఈ ఏడాది హైదరాబాద్‌ నుంచి వైజాగ్‌కు మారుతున్నాం. వైజాగ్‌ పోర్ట్‌ ఇండోర్‌ స్టేడియం పీకెఎల్‌కు వేదికగా నిలువనుంది’ అని తెలుగు టైటాన్స్‌ సీఈవో త్రినాథ్‌ రెడ్డి తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ ఏడాది పీకెఎల్‌కు వైజాగ్‌తో పాటు జైపూర్‌, చెన్నై, న్యూఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనుండగా.. ప్లే ఆఫ్స్‌ వేదికలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -