Monday, August 4, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంసిడ్నీ హార్బర్‌ బ్రిడ్జిపై పాలస్తీనా అనుకూల కవాతు

సిడ్నీ హార్బర్‌ బ్రిడ్జిపై పాలస్తీనా అనుకూల కవాతు

- Advertisement -

వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజే
సహా ప్రముఖులు, ప్రజల మద్దతు
గాజాలో మానవతా సంక్షోభం తీవ్రం
శాంతి, సహాయం కోసం నిరసనకారులు డిమాండ్‌
సిడ్నీ:
ఇజ్రాయిల్‌ దాడులతో నిత్యం ప్రాణాలు కోల్పోతున్న గాజాలోని పాలస్తీనావాసులకు మద్దతుగా ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కుండపోతగా వర్షం పడుతున్నా లెక్కచేయకుండా భారీ ర్యాలీ నిర్వహించారు. వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజే సహా అనేక మంది ప్రముఖులు, ప్రజ లు గాజావాసులకు మద్దతు పలికారు. వృద్ధుల నుంచి చిన్న పిల్లలతో ఉన్న కుటుంబాలు కూడా ఈ ప్రదర్శనలో గళమెత్తాయి. ప్రఖ్యాత సిడ్నీ హార్బర్‌ బ్రిడ్జ్‌ పైకి భారీగా చేరుకున్న నిరసనకారులు… గాజా వాసులకు మద్దతుగా బ్యానర్లు ప్రదర్శించారు. గాజాపై దాడులు ఆపాలని డిమాండ్‌ చేశారు. మానవతా సాయం అందేలా చూడాలని కోరారు. భారీ సంఖ్యలో వచ్చిన ప్రదర్శనకారులు తమ మార్గాన్ని మార్చుకోవడంతో.. సిడ్నీ హార్బర్‌ బ్రిడ్జిపై ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ఇజ్రాయిల్‌ దాడుల్లో గాజాలో 60,400 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో సిడ్నీలో ర్యాలీ నిర్వహించారు.మానవతా సంక్షోభం తీవ్రమవు తున్న యుద్ధంతో దెబ్బతిన్న గాజా స్ట్రిప్‌లో శాంతి, సహాయం చేయాలంటూ నినదించారు.

భద్రతాపరమైన అడ్డంకులు ఉన్నా..ప్రదర్శనకు సుప్రీం అనుమతి
భద్రతాపరమైన సమస్యలు ఉన్నాయని ఆస్ట్రేలియా ప్రభుత్వం, పోలీసులు వాదించింది. అయితే అక్కడి సుప్రీంకోర్టు ప్రదర్శనకు అనుమతించింది. 90,000 మంది వరకు హాజరైనట్టు న్యూ సౌత్‌ వేల్స్‌ పోలీసులు తెలిపారు, ఇది ఊహించిన దానికంటే చాలా ఎక్కువ అని నిరసన నిర్వాహకులు తెలిపారు. మెల్‌బోర్న్‌లో కూడా ఇలాంటి నిరసన ప్రదర్శనలు జరిగాయి.

ఇజ్రాయిల్‌పై పెరుగుతున్న దౌత్యపరమైన ఒత్తిడి..
ఇటీవల ఇజ్రాయిల్‌పై దౌత్యపరమైన ఒత్తిడి పెరుగుతోంది. ఫ్రాన్స్‌ , కెనడా పాలస్తీనా రాజ్యాన్ని గుర్తిస్తాయని చెప్పాయి .మరోవైపు ఇజ్రాయెల్‌ మానవతా సంక్షోభాన్ని పరిష్కరించి కాల్పుల విరమణకు చేరుకోకపోతే తాము కూడా పై దేశాల బాటను అనుసరిస్తామని బ్రిటన్‌ చెబుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -