Thursday, January 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాల్లో సమస్యల తిష్ట.!

గ్రామాల్లో సమస్యల తిష్ట.!

- Advertisement -

అస్తవ్యస్తంగా రోడ్లు, డ్రెయినేజీలు
కొత్త సర్పంచులకు సవాళ్లే
నవతెలంగాణ – మల్హర్ రావు

గ్రామాల్లో మౌలిక వసతుల కోసం రూ. లక్షల ఖర్చు చేసి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువస్తామని చెబుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారుల తీరుకు విరుద్ధంగా ప్రస్తుతం గ్రామాలు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. మండలంలోని పలు గ్రామాల్లో అస్తవ్య స్తమైన రోడ్లు, సైడ్ కాల్వలు లేక మురికి కూపాలుగా,విధి వీలైట్లు వెలగక చికటితో దర్శనం ఇస్తున్నాయి. జీపీల్లో నిధులలేమితో కనీస వసతులు ఏర్పాటు చేయాలని ప్రజలు అధికారులకు ఎన్నో మార్లు విన్నవించిన నిరాశే మిగిలింది.

ప్రత్యేక అధికారుల పాలనలో పల్లెలు అస్తవ్యస్తంగా తయారైయ్యాయి.పంచాయతీ కార్యదర్శులు జీపీ ట్రాక్టర్ల డీజిల్,చిన్న వసతుల ఏర్పాటులో తమ సొంత డబ్బులు ఖర్చులు చేసి అప్పులపాలైయ్యారు. కొన్ని గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో నిర్మాణ దశలో ఉన్న జీపీ భవనాలు బిల్లులు రాక, నిధులు విడుదల కాక అసంపూర్తిగా మిగిలిపోయాయి. గ్రామాల్లో కొత్త పాలక వర్గాలు ఏర్పాటు అవడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన అభివృ ద్ధి నిధుల కోసం ప్రజలు ఆశగా ఎదురుచూస్తు న్నారు. కొత్తగా ప్రమాణస్వీకారం చెసిన పాలకవర్గాలకు సవాళ్ళగా మారాయి.

నిధులకోసం ఎదురుచూపులు..
కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం,రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఎస్ఎఫ్ నిధులు,అలాగే ఉపాధిహామీ పథకం ద్వారా రావాల్సిన పెండింగ్ నిధులు పంచాయతీ అకౌంట్ లో జమ అయితే అభివృద్ధి పనులు జరుగుతాయని గ్రామాల్లోని ప్రజలు ఆశతో ఉన్నారు. రెండేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రామాలకు రావాల్సిన అభివృద్ధి నిధులు రాకపోవడంతో గ్రా మాల్లో కనీస వసతులు లేకుండాపోయాయి. ఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయి పరి శీలన జరిపి అత్యవసర నిధులతోపాటు పెండిం గ్లో ఉన్న నిధులను కూడా ఇప్పించాలని నూతన సర్పంచ్లు కోరుతున్నారు.

అత్యవసర పనులను గుర్తిస్తాం..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుoచి నిధులు మంజూరైతే మొదటగా అత్యవసర పనులకు వినియోగిస్తాం. పంచా యతీ కార్యదర్శుల ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన జరిపించి తప్పనిసరిగా చేయాల్సిన పనులను గుర్తిస్తాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -