Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంగురుకులాల్లో సమస్యలు

గురుకులాల్లో సమస్యలు

- Advertisement -

– సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి నిర్లక్ష్యం
– సమస్యలు వినడానికి సమయమివ్వని వైనం
– పైరవీకారులకు, తాయిలాలు ఇచ్చే వారికే ప్రాధాన్యత
– నిరసనగా ఖాళీ కుర్చీకి ఎస్‌ఎఫ్‌ఐ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

గురుకులాల్లో సమస్యల పట్ల సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి అలుగు వర్షిణి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ ఆరోపించింది. నిరసనగా ఖాళీ కుర్చీకి మంగళవారం వినతి పత్రాన్ని అందజేసింది. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌.రజనీకాంత్‌, టి.నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో గురుకులాల్లో నెలకొన్న సమస్యలను ఆ శాఖ కార్యదర్శి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సీవోఈ (సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ) గురుకులాల్లో కేవలం నీట్‌, జేఈఈ మాత్రమే బోధిస్తున్నారని తెలిపారు. ఇప్పుడే చదువులోకి వస్తున్న పేద విద్యార్థులను చదువుకు దూరం చేసే చర్యలకు పూనుకుంటున్నారని విమర్శించారు. ఇంటర్‌ ఇంప్రూమెంట్‌ పరీక్షల ఫలితాలు రాకముందే విద్యార్థులను వేరే పాఠశాలలకు పంపాలని ఆదేశాలు ఇవ్వడం తగదని హితవు పలికారు.

రాష్ట్రంలో 12 గురుకులాలను మూసేసెందుకు నిర్ణయించటంతోపాటు కోర్సుల ఎత్తివేత , అద్దె భవనాలకు చెల్లింపులు చేయకపోవడం లాంటి గందరగోళ పరిస్థితులను గురుకుల సంస్థ చేస్తోందని ఆరోపించారు. లెక్చరర్లను మార్చడం లాంటి చర్యలు తీసుకుని వారిని రోడ్డున పడేశారని చెప్పారు. ఈ అంశాలపై చర్చించేందుకు కనీస అవకాశం ఇవ్వలేదని అన్నారు. పైరవీకారులకు ప్రాధాన్యత కల్పిస్తూ పేద విద్యార్థుల చదువులకు నష్టం చేకూర్చే చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు లెనిన్‌, రమేష్‌ పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad