Saturday, July 19, 2025
E-PAPER
Homeకరీంనగర్జూనియర్‌ కళాశాలలో సమస్యలు పరిష్కరించాలి: ఎస్‌ఎఫ్‌ఐ

జూనియర్‌ కళాశాలలో సమస్యలు పరిష్కరించాలి: ఎస్‌ఎఫ్‌ఐ

- Advertisement -

నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను తక్షణమే పరిష్కరించాలని శనివారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) డిమాండ్‌ చేసింది. కళాశాలలో అసమర్థమైన మౌలిక సదుపాయాలు, శిథిలమైన వాష్‌రూమ్‌లు, లైబ్రరీ గది, పాడైన తరగతి గదులు, విరిగిన బెంచీలు విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలు విద్యార్థుల విద్యా ప్రమాణాలను, ఆరోగ్యాన్ని, సురక్షిత వాతావరణాన్ని దెబ్బతీస్తున్నాయని వారు పేర్కొన్నారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ సంజన డిమాండ్‌ చేశారు. వాష్‌రూమ్‌లు, లైబ్రరీ, కీ సపరేట్‌ రూమ్‌ (స్టాఫ్ రూమ్) మరమ్మతు చేయించాలని, శిథిలమైన బెంచీలను తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సమస్యలను విస్మరిస్తే, విద్యార్థుల హక్కుల కోసం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కళాశాల ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో వేములవాడ మండల అధ్యక్షుడు, కార్యదర్శులు సాయి భారత్, శివ, నాయకులు ప్రభాస్, బన్నీ, రాకేష్, శివ, హేమంత్, మహేష్, చందు, అశ్విని, అఖిల, గాయత్రీ, హంషిక, రేణుక, సింధు తో పాటు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -