Saturday, September 20, 2025
E-PAPER
Homeఖమ్మంసుందరయ్య నగర్ లో సమస్యలు పరిష్కరించాలి: సీపీఐ(ఎం)

సుందరయ్య నగర్ లో సమస్యలు పరిష్కరించాలి: సీపీఐ(ఎం)

- Advertisement -

డ్రైనేజీలో మురుగును తొలగించాలి, బ్లీచింగ్ చేయించాలి 
నవతెలంగాణ- మణుగూరు
సుందరయ్య నగర్ లో సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సత్ర పల్లి సాంబశివ డిమాండ్ చేశారు. శనివారం సీపీఐ(ఎం) మణుగూరు మండల కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య నగర్ గ్రామంలో  సమస్యలపై అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. సైడ్ డ్రైనేజీలు అద్వాన్నంగా ఉన్నాయన్నారు.  చెత్తాచెదారంతో కాలనీలోని డ్రైనేజీలు నిండిపోయాయి అని అన్నారు. విపరీతమైన దుర్వాసనతో ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. దోమలకు నిలయంగా మారాయని అన్నారు.

వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాలు ప్రబలుతున్నాయి అన్నారు. సుందరయ్య నగర్ లో ఉన్నటువంటి వీధులు తిరిగి సమస్యలు తెలుసుకోవడం జరిగింది అన్నారు. వీధిలైట్లు లేకపోవడం, కాలువలు పూడికతీత తీయకపోవడం, ప్రధాన సమస్యలు పరిష్కరించడంలో అధికారులు విప్లమవుతున్నారని అన్నారు. తక్షణమే సుందరయ్య నగర్ సమస్యలు పరిష్కరించాలని అన్నారు.  డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని వెంటనే బ్లీచింగ్ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కొడిశాల రాములు, నైనారపు నాగేశ్వరరావు, సాంబయ్య, పాపిలి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -