Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సర్కార్ దావఖానలో సమస్యలు పరిష్కరించాలి..

సర్కార్ దావఖానలో సమస్యలు పరిష్కరించాలి..

- Advertisement -

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ
నవతెలంగాణ – తిమ్మాజిపేట

సర్కార్ దావఖానలో సమస్యలు పరిష్కరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ అన్నారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని లక్ష్మణ చారి భవన్ లో సిపిఐ జిల్లా కౌన్సిల్ సమావేశం ఈర్ల చంద్రమౌళి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి జిల్లా పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ ముఖ్యఅతిథిగా నిర్మాణ బాధ్యులు ఎం బాల నరసింహ హాజరై మాట్లాడారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల  కాలనీలు, గ్రామాలు, పట్టణాలు అన్ని కలుషితమై ఈగలు దోమలు ఎక్కువై ప్రజలు రోగాల బారిన పడి ప్రభుత్వ హాస్పిటల్ కు వస్తే అక్కడ రోగులకు సరిపడా పడకలు గాని మందులు గాని అందుబాటులో లేవని చిన్న చిన్న రక్త పరీక్షలు కూడా చేయకుండా ప్రైవేటు ల్యాబ్ లకు పంపడం వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు.

జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు అయ్యి నాలుగు సంవత్సరాలు అవుతున్న జిల్లా ప్రజలకు సరైన వైద్యం అందటం లేదని అన్ని రకాల జబ్బులకు ఇంకా సరైన వైద్యులు జిల్లా ఆసుపత్రిలో లేకపోవడం బాధాకరమని వారు అన్నారు. తక్షణమే జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పీహెచ్సీ కేంద్రాల్లో కూడా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని యెడల డిఎంహెచ్ఓ ను ముట్టడిస్తామని వారు ఉన్నారు. అదేవిధంగా అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఎకరాకు లక్ష రూపాయల నష్టపరిహారం కేటాయించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర సమితి సభ్యులు హెచ్ ఆనంద్ జి, కేశవులు గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు పెబ్బేటి విజయుడు, కోళ్ల యేసయ్య, జిల్లా సమితి సభ్యులు కృష్ణాజి, శంకర్ గౌడ్, మర్యాద వెంకటయ్య, బోల్లెద్దుల శ్రీను, రవీందర్, విద్య శ్రీను, బండి లక్ష్మీపతి, తుమ్మల శివుడు, మారేడు శివశంకర్, బాల మురళి, వెంకటమ్మ, కిరణ్ కుమార్, ఖాజా మైనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad