సమస్యలు పరిష్కరించాలి

–పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మిక సంఘాల విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘాలు పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీని కోరాయి. భత్రుహరి మతాబ్‌ సారథ్యంలో 31 మంది ఎంపీల బృందం కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యల అధ్యయనం కోసం లేబర్‌ అండ్‌ టెక్స్‌టైల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పార్లమెంటరీ కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తున్నది. మంగళవారం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో కార్మిక సంఘాలతో సమావేశమైంది. సింగరేణిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కాంట్రాక్ట్‌ కార్మికులంతా కలిసి పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మెన్‌కు వినతి పత్రం అందజేశారు. సింగరేణిలో హైపవర్‌ కమిటీ వేతనాల అమలు, సమాన పనికి సమాన వేతనం, 2022 సెప్టెంబర్‌లో జరిగిన ఒప్పందం అమలు, కుటుంబ సభ్యులకు వైద్యం, ఈఎస్‌ఐ సదుపాయం, లాభాల బోసన్‌, మరణించిన కార్మికులకు ఎక్స్‌గ్రేషియో, వలస కార్మికులకు సమస్యలు, సెలవులు, కార్మిక హక్కులు, బోనస్‌, కాంట్రాక్ట్‌ లేబర్‌ చట్టం, వలస కార్మికుల చట్టం, గ్రాట్యుటీ చట్టం అమలు, 12 గంటల పని, అన్ని విభాగాలకు సిఎంపిఎఫ్‌ అమలు, నర్సరీ కార్మికులు, కన్వేయన్స్‌ డ్రైవర్లు, గుటకల షెడ్డు కార్మికులకు కనీస వేతనాల అమలు, బెల్ట్‌ క్లీనింగ్‌, సేల్‌ పీకింగ్‌, వర్క్‌ షాప్‌, రైల్వే సైడింగ్‌, బ్లాస్టింగ్‌, ట్రాక్టర్‌ డ్రైవర్లు తదితర కార్మికులకు స్కిల్డ్‌ వేతనాల చెల్లింపు లాంటి సమస్యలను పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కమిటీ సింగరేణి యాజమాన్యం సి అండ్‌ ఎమ్‌డీ, డైరెక్టర్లు ఇతర అధికారులతో సమావేశమైంది. కార్మిక సంఘాలు, కార్మికులు లేవనెత్తిన సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లింది. వారి సమస్యలను పరిష్కరించాలనీ, వేతనాల పెంపుదలకు చర్యలు తీసుకోవాలని సూచించింది. సమావేశంలో సింగరేణి యాజమాన్యం తరఫున సీఎండీ ఎన్‌.శ్రీధర్‌, డైరెక్టర్‌ (పా) ఎన్‌. బల రామ్‌, ఇ అండ్‌ ఎమ్‌డీ సత్యనారాయణరావు, ఆపరేషన్‌ ఎన్‌వీకె శ్రీనివాస్‌, ప్రాజెక్ట్‌ ప్లానింగ్‌ జి. వెంకటరెడ్డి, జనరల్‌ మేనేజర్‌ కో-ఆర్డినేషన్‌ ఎం. సురేష్‌, పర్సనల్‌  ఐఆర్‌పి ఎం ఎ. కుమార్‌ రెడ్డి, పర్సనల్‌ వెల్ఫేర్‌ అండ్‌ ఆర్‌సి కె. బసవయ్య, ఎంపీఎం. సుబ్బారావు, సిఎంసి ఎల్‌వి. సూర్య నారాయణ, సివిల్‌ టి. సూర్యనారాయణ, ఎజిఎం పర్సనల్‌ కవితా నాయుడు, కార్మిక సంఘాల తరఫున సిఐటియు నాయకులు బి. మధు, ఏఐటియుసి నాయకులు గుత్తుల సత్యనారాయణ, బిఎంఎస్‌ నాయకులు యాదగిరి సత్త య్య, ఐఎన్‌టియుసి నాయకులు నాగభూషణం, హెచ్‌ ఎంఎస్‌ నాయకులు జీవన్‌ పాల్‌, టిసికెఎస్‌ నాయకులు మద్దెల శ్రీనివాస్‌, కార్మికులు సిహెచ్‌. శ్రీకాంత్‌, పి. శాంత మూర్తి, రొడ్డా కిరణ్‌కుమార్‌, ఎండి. గౌస్‌భాషా, అమ్రిష్‌ కుమార్‌, సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మికుల సంఘం (సిఐటి యు)నాయకులు జి. శ్యామ్‌, సిహెచ్‌. అరవింద్‌,సమ్మయ్య, కుమారి, శ్రీనివాస్‌, డిప్యూటీ చీఫ్‌ లేబర్‌ కమీషనర్‌ (సెం ట్రల్‌) వై. శ్రీనివాస్‌, రీజినల్‌ లేబర్‌ కమీషనర్‌ (సెంట్రల్‌) సాహు, అసిస్టెంట్‌ లేబర్‌ కమీషనర్‌ (సెంట్రల్‌) మహంతి, లేబర్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌(సెంట్రల్‌) ఎన్‌. శంకరరావు, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love