నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ సుంకెట బుచ్చన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి చేతుల మీదుగా లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీలను అందించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో, గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి చింత రాజా శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామానికి చెందిన 96 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్లు తెలిపారు. ఇండ్లు మంజూరైన లబ్ధిదారులందరికీ ప్రొసీడింగ్స్ అందించినట్లు వివరించారు.ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలను త్వరలోనే చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు నూకల బుచ్చి మల్లయ్య, సింగిరెడ్డి శేఖర్, నిమ్మ రాజేంద్రప్రసాద్, సల్లూరి జ్యోతి, లోలం లలిత, పంచాయతీ కార్యదర్శి గంగా జమున, సల్లూరి గణేష్ గౌడ్, అజ్మత్ హుస్సేన్, పూజారి శేఖర్, నాగరాజు, ఆల్గోట్ రంజిత్, వేములవాడ జగదీష్, కంపదండి అశోక్, తదితరులు పాల్గొన్నారు.
96మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES