Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeసినిమానిర్మాత మాగంటి గోపీనాథ్‌ ఇకలేరు

నిర్మాత మాగంటి గోపీనాథ్‌ ఇకలేరు

- Advertisement -

నిర్మాత మాగంటి గోపీనాథ్‌ (62) కన్నుమూశారు. ఈనెల 5న ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. నాలుగు చిత్రాలను నిర్మించి అభిరుచిగల నిర్మాతగా మాగంటి గోపీనాథ్‌ పేరొందారు. 1995లో ‘పాతబస్తీ’ చిత్రంతో నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత రాజశేఖర్‌తో ‘రవన్న’ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సూపర్‌స్టార్‌ కృష్ణ ఓ కీలక పాత్ర పోషించారు. అలాగే రాజశేఖర్‌తో ‘నా స్టయిలే వేరు’ చిత్రాన్ని కూడా నిర్మించారు. ఇక 2004లో తారకరత్నతో ‘భద్రాద్రిరాముడు’ సినిమాని తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలేవీ ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేదు. దీంతో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసి, ప్రజానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకత సొంతం చేసుకున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad