నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల వేతనాల పెంపు అంశంపై గత కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతకు నిర్మాతలు తెరదించారు. వేతనాలను పెంచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే కొన్ని షరతులు వర్తిస్తాయని స్పష్టం చేశారు. శనివారం ఫిల్మ్ ఛాంబర్‌లో యాక్టివ్ ప్రొడ్యూసర్స్ మీడియా సమావేశం నిర్వహించి, తమ ప్రతిపాదనలను వెల్లడించారు.
ఈ సమావేశంలో నిర్మాతలు రెండు రకాల వేతన పెంపు విధానాలను ప్రకటించారు. రోజుకు రూ. 2000 లేదా అంతకంటే తక్కువ వేతనం తీసుకునే కార్మికులకు మొదటి ఏడాది 15 శాతం, రెండవ ఏడాది 5 శాతం, మూడవ ఏడాది మరో 5 శాతం చొప్పున వేతనం పెంచడానికి సుముఖత వ్యక్తం చేశారు. అదేవిధంగా, రోజుకు రూ. 1000 లేదా అంతకన్నా తక్కువ వేతనం పొందుతున్న కార్మికులకు మొదటి ఏడాది 20 శాతం, మూడవ ఏడాది 5 శాతం పెంచనున్నట్లు తెలిపారు. అయితే, వీరికి రెండవ ఏడాది వేతన పెంపు ఉండదని స్పష్టం చేశారు.
Film Chamber: ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్మాతల ప్రెస్ మీట్.. వేతనాలపై క్లారిటీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES