- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ కాంతి హై స్కూల్ యందు బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శశాంక్ చిన్నారి బాలబాలికలతో జయశంకర్ ఫోటో కి పూలమాలతో సత్కరించడం జరిగింది. పాఠశాల ప్రిన్సిపాల్ గంగారెడ్డి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో తెలంగాణకి జరుగుతున్న అన్యాయాన్ని యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలిసే విధంగా ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ప్రాణ త్యాగాన్ని చేసిన గొప్ప మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంతి హై స్కూల్ ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -