Friday, September 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధ్యాయులకు వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులు 

ఉపాధ్యాయులకు వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులు 

- Advertisement -

నవతెలంగాణ-నిజాంసాగర్/మహమ్మద్ నగర్ 
ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని ప్రాథమిక, ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యను బోధిస్తున్న ఉపాధ్యాయులకు మంగళవారం నుండి శనివారం వరకు మండల స్థాయి వృత్తి నైపుణ్య  శిక్షణ తరగతులు ప్రారంభించినట్టు మండల విద్యాశాఖ అధికారి తిరుపతిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల కనీస సామర్థ్యాలను సాధించడానికి వివిధ బోధనా పద్ధతులను సమ్మిళితం చేస్తూ బోధన చేయడం వల్ల ఇట్టి సామర్థ్యాల సాధన జరుగుతుందని ఆయన అన్నారు. అనంతరం మహమ్మద్ నగర్ విద్యాశాఖ అధికారి అమర్ సింగ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులలో వృత్యంతర శిక్షణ మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన బోధనా పద్ధతులను జోడించి సులభతరంగా విద్యార్థులకు అర్థమయ్యేలా ఈ శిక్షణ ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.కార్యక్రమంలో అచ్చంపేట్ కాంప్లెక్స్ హెచ్ఎం వెంకట్ రామ్ రెడ్డి, జి హెచ్ ఎస్ నిజాంసాగర్ కాంప్లెక్స్ హెచ్ఎం వెంకటేశం ఎమ్మార్పీలు లాల్ సింగ్ ,జనార్దన్, సురేందర్, సి ఆర్ పి ల నర్సింలు‌,శంకర్, వెంకట్రాములు ఎంఆర్సి సిబ్బంది రాజు,పంచాక్షరీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -