Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్తెలంగాణ ఉద్యమానికి జీవితం అంకితం చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్...

తెలంగాణ ఉద్యమానికి జీవితం అంకితం చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్…

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్‌ జయశంకర్‌ అని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్  హనుమంత రావు అన్నారు. బుధవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్‌  91 వ జయంతి  పురస్కరించకుని వారి చిత్ర పటానికి జిల్లా కలెక్టర్, రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి, స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లడుతూ జీవితమంతా  తెలంగాణ ఉద్యమానికి, స్వరాష్ట్ర ఏర్పాటుకు అంకితం చేసిన  గొప్ప వ్యక్తి ఆచార్య జయశంకర్  అని , వారి సేవలు చిరస్మరణీయమని  కలెక్టర్  అన్నారు.  తెలంగాణ  ఆశ, శ్వాసగా జీవించి ఉద్యమానికి దిక్సూచిగా నిలిచారని కొనియాడారు. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో పోరాడి మలి దశ ఉద్యమంలో స్వరాష్ట్ర సాధనకు ఆచార్య జయశంకర్ మార్గదర్శనం గా నిలిచారన్నారు.ఆచార్య జయశంకర్  మన మధ్య లేనప్పటికీ.. అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని వెల్లడించారు. ఆచార్యుని ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో  రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణా రెడ్డి, ఏవోజగన్మోహన్ ప్రసాద్ ,బీసీ సంక్షేమ అధికారి సాహితి , యస్. సి కార్పొరేషన్ ఈ డి శ్యామ్ సుందర్,  బీసీ సంఘం నాయకులు,కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad