Monday, February 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కష్టజీవుల జీవన చిత్రాన్ని ఆవిష్కరించేదే అభ్యుదయ కవిత్వం

కష్టజీవుల జీవన చిత్రాన్ని ఆవిష్కరించేదే అభ్యుదయ కవిత్వం

- Advertisement -

నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
కర్మనిష్ట, సమయపాలనను ప్రతి ఒక్కరూ అలవర్చుకుని, ప్రగతి పథంలో పయనించాలని రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహా దారు డాక్టర్ కెవి రమణాచారి అన్నారు. యువభారతి, సాహితీ జోగీష సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న తెలుగు వెలుగు సమాఖ్య కార్యక్రమంలో భాగంగా 17వ సమావేశం ఆదివారం సుల్తాన్ బజార్ లోని శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతి థిగా హాజరై ప్రసంగిస్తూ కష్టజీవుల జీవన చిత్రాన్ని ఆవిష్కరించేదే అభ్యుదయ కవిత్వమని అన్నారు.

అధ్యక్షులు ఆచార్య వంగపల్లి విశ్వనాధం మాట్లా డుతూ తెలుగు సాహిత్య అభివృద్ధి కోసం చేస్తున్న సంస్థలతో కలిసి పని చేయడం యువభారతి లక్ష్యమని అన్నారు. ప్రధాన వక్తగా హాజరైన ఆచార్య పివి ఉమా శశి మాట్లాడుతూ.. ఆధునిక కవులంతా సమాజ హితాన్ని లోక కళ్యాణాన్ని కాంక్షించినవారేనని అన్నారు. పాఠకుల హృదాయాలను ఉత్తేజ పర్చేదే అభ్యుదయ భావకవిత, అటువంటి కావ్యాన్ని హృదయంగమం చేసుకోవడమే ప్రతి తెలుగు సాహితీ ప్రియుడు కర్తవ్యంగా భావించాలన్నారు. ఆత్మీయ అతిథి గా ఆచార్య ఫణీంద్ర, డాక్టర్ పి లలితా వాణిలు పాల్గొనగా, సాధన నరసింహాచార్య, జీడిగుండు వేంకటవరావు, రవీంద్ర తదితరులు కార్యక్రమాన్ని పర్య వేక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -