- Advertisement -
పరమత ద్వేషం
ప్రతి నిముషం
రగలాల్సిందేనా..?
రక్తపుటేరులు పారినా
శవాల గుట్టలు పేరినా
బాధిత హాహాకారాలు
మిన్నంటినా…
రవ్వంత చలనం
రాదెందుకని..?
యుద్ధ పిపాసికదా..
విశ్వనేతగా మారి
జబ్బలు చరుచుకుంటున్నాడా!
మీడియా డబ్బా కొడ్తుందే!
గురువింద
నలుపెరగదుగా మరి!
మతం పేర నరజాతి
హతం ఇంకెంతకాలం?
ఏ మతంలో పుట్టేదైనా
ఎవరికైనా ఎలా తెలిసేది?
మతం పుట్టుక తెలియని
అజ్ఞాని ఎక్కడ పుడితే ఏమిలే?
అజ్ఞానం ద్వేషం కలిస్తే
అధిక హింసోన్మాదమే
పరమత ద్వేషం
నరజాతికి కారాదు శాపం
ఆత్మ రక్షణా పోరాటం
అనివార్యమే ఎవరికైనా
యుద్ధంలో పరాజితులైతే తప్ప
బాధితుల బాధ తెలిసేది
అకారణ ద్వేషం తొలిగేది
ద్వేషాన్ని ద్వేషించడమే
నేటి శాంతికి పునాది
నవశకానికి నాంది
కె శాంతారావు
9959745723
- Advertisement -



