జాతీయ బిసి సంఘం జిల్లా ఇంచార్జి విజయగిరి సమ్మయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని జాతీయ బిసి సంఘం జిల్లా ఇంచార్జి విజయగిరి సమ్మయ్య మంగళవారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు సకలజనుల సమ్మె చేశారని,స్వరాష్ట్రo కోసం తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంత్ చారి, కానిస్టేబుల్ కిష్టయ్య, చాలామంది ప్రాణత్యాగంతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. స్వరాష్ట్రంలో పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులను అణదొక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి అమరవీర్ల కుటుంబాలను ఆదుకుంటానే హామీలు ఇచ్చిందన్నారు. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. అమరవీల కుటుంబాలకు ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగం,నామినేట్ పోస్టులో ఉద్యమకారులను గుర్తించాలని కోరారు. త్వరలోనే కాటారం సబ్ డివిజన్లో ఉద్యమకారుల సమావేశం నిర్వహిస్తామన్నారు.
ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలుజేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



