బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
తెలంగాణ భవన్‌కు ఆటోడ్రైవర్ల ర్యాలీ
ఆటోలో ప్రయాణించిన మాజీమంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆటోడ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి బంజారాహిల్స్‌లోని బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌కు ఆటో డ్రైవర్ల ర్యాలీ నిర్వహించారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి ఆటోలో కేటీఆర్ ప్రయాణించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని ఎన్నికలకు ముందు ఆటోలో తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ (అప్పుడు యజమాని) మష్రత్ అలీ ఆటోలోనే కేటీఆర్ ప్రయాణించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రయాణించిన ఆటో యజమాని రెండు ఆటోలను అమ్ముకుని డ్రైవర్ అయ్యారని తెలిపారు. కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో ఆ ఆటో యజమాని రెండు ఆటోలను అమ్ముకునే పరిస్థితి తెచ్చారని విమర్శించారు. మష్రత్ అలీ పరిస్థితి అడిగి తెలుసుకున్న కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని ప్రతిపక్ష పార్టీగా ఎండగడుతామని హెచ్చరించారు. మరోవైపు గోకుల్ థియేటర్ నుంచి తెలంగాణ భవన్ చేరిన ర్యాలీని ఉద్దేశించి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడారు.
కాంగ్రెస్ ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ పాలనలో లభించిన సబ్సిడీలు, బెనిఫిట్స్ అన్ని నిలిచిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు అండగా నిలిచే పార్టీ బీఆర్‌ఎస్ పార్టీయేనని తెలిపారు. ఈ ర్యాలీలో కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



