Saturday, September 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వికలాంగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

వికలాంగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

- Advertisement -

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కు వినతి
నవతెలంగాణ – మల్హర్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం మేనిపేస్టోలో వికలాంగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు శనివారం ఎమ్మార్సీస్ మండల అధ్యక్షుడు కేశారపు నరేశ్ మాదిగ ఆధ్వర్యంలో ఎంపిడిఓ శ్రీరామ్మూర్తికి వినతిపత్రం అందజేశారు. వికలాంగుల చట్టం ప్రకారం స్వయం ఉపాధి పథకం కింద రూ.5 లక్షల నుండి రూ.15 లక్షల వరకు గ్రాంట్ రూపంలో అర్హులైన వ్యక్తులకు అందించాలని కోరారు. ఆసరా పింఛన్ రూ.4వేల నుంచి రూ.6 వేలు పెంచాలని, రాజకీయ, ఉద్యోగాలు, వైన్స్ షాపుల్లో, రిజర్వేషన్లు, ఉపాధిహామి పథకంలో 150 నుంచి 200 పని దినాలు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో  ఎమ్మార్పీఎస్, వికలాంగుల సంఘం నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -