Friday, September 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపిల్లలకు అవగాహనా కార్యక్రమాలపై ప్రచారం చేయండి

పిల్లలకు అవగాహనా కార్యక్రమాలపై ప్రచారం చేయండి

- Advertisement -

– టీశాట్‌ సీఈఓ వేణుగోపాల్‌రెడ్డిని కోరిన చైల్డ్‌ రైట్‌ కమిషన్‌ చైర్‌పర్సన్‌ సీతాదయాకర్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

విద్య, ఉపాధి, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం వంటి కార్యక్రమాల మాదిరిగానే పిల్లలకు అవగాహన కల్పించే, చైతన్యపరిచే కార్యక్రమాలను కూడా ప్రచారం చేయాలని టీశాట్‌ సీఈఓ బోదనపల్లి వేణుగోపాల్‌రెడ్డిని చైల్డ్‌ రైట్స్‌ కమిషన్‌ చైర్‌పర్సన్‌ కొత్తకోట సీతాదయాకర్‌రెడ్డి కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లో టీశాట్‌ సీఈఓను ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం, పాఠశాల విద్యాశాఖ ఆధ్వరంలో పలు కార్యక్రమాలు నిర్వహించాలని అలాగే పిల్లల కోసం కూడా ప్రత్యేక కార్యమాలు భవిష్యత్‌లో కమిషన్‌ నుంచి టీశాట్‌ ద్వారా చేస్తామని వేణుగోపాల్‌రెడ్డి హామీనిచ్చారు. డిజిటల్‌ మాధ్యమాల ప్రభావం పిల్లలపై చాలా ఉందనీ, పిల్లలతో పాటు వారి తల్లితండ్రులకు కూడా అవగాహన కల్పించే కార్యక్రమాలు చేస్తామని హామీనిచ్చారు. పిల్లల హక్కుల పరిరక్షణ, సామాజిక దురాచారాలు పాటించొద్దనీ, బాల్యవివాహాలు చేయొద్దని అవగాహన కల్పించే కమ్యూనిటీ క్యాంపైన్‌ ప్రతి నెలా టీ-శాట్‌ ద్వారా నిర్వహించాలని చైర్‌పర్సన్‌ సీతాదయాకర్‌ రెడ్డి కోరారు. డిజిటల్‌ మీడియా ప్రభావం, జేజే యాక్ట్‌, ఇతర చట్టాల అవగాహన కల్పించడం ద్వారా టీశాట్‌ ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో చైల్డ్‌ రైట్స్‌ కమిషన్‌ సభ్యులు వచన్‌ కుమార్‌, వందన గౌడ్‌, చందన, అపర్ణ, సరిత, ప్రేమలత అగర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -