– మంత్రి శ్రీధర్‌బాబు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అధికారం నుంచి దిగిపోవాలంటూ బీజేపీ నాయకులు మాట్లాడటం వారి అవివేకానికి నిదర్శనమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. కేంద్రంలో బీజేపీ నేతలను దిగిపోవాలంటూ డిమాండ్ చేయగలరా? అని ప్రశ్నించారు. పహల్గాం దుర్ఘటన నేపథ్యంలో ఎవరు దిగిపోవాలో చెప్పగలరా? అని నిలదీశారు. మంగళవారం హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో ఇష్టాగోష్టి గా మాట్లాడారు. ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా నెరవేర్చిందా? సమాధానం చెప్పాలన్నారు. ప్రధాని మోడీ ఎన్నో దేశాల్లో పర్యటించారు, మరి లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయా? అని ప్రశ్నించారు. ఒకరిద్ద రు బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని బెదిరించినట్టు మాట్లా డారనీ, దానికి సీఎం రేవంత్ ప్రతి స్పందించారని తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన లక్షల కోట్ల అప్పులు, వారు చేసిన తప్పుల గురించి ప్రజలకు తెలియజేందుకే రేవంత్‌రెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్న హెలికాప్టర్‌ను బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అద్దెకు తీసుకుందని గుర్తు చేశారు. మంత్రులు జిల్లాల్లో పర్యటిస్తే కార్ల తిరగడం వల్ల అయ్యే ఖర్చు కంటే హెలికాప్టర్‌లో తిరిగితే ఖర్చు తక్కువగా ఉందని చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రులు హెలికాప్టర్‌లో తిరగకుండానే అద్దె చెల్లించారని గుర్తు చేశారు. ప్రజా సంక్షేమం కోసం సీఎం ఆలోచించి మాట్లాడారని తెలిపారు. ఆర్థిక వ్యవస్థను గత పాలకులు చిన్నా,భిన్నం చేశారని విమర్శించారు. ఆ పరిస్థితులను చూసిన రేవంత్ ఆవేదనతో ఆ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఉద్యోగులతో బీఆర్‌్‌ఎస్ పార్టీకి పేగుబంధం ఉంటే, ఆనాడు టైమ్‌కు జీతాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డీఏ ఇచ్చాం. వాళ్ళలా మేం వదిలేయలేదు. కార్పొరేషన్ పేరుతో తెచ్చిన అప్పులు కూడా ప్రభుత్వమే కడుతుంది. గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించే మాట్లాడుతున్నారు. వాళ్లు చేసిన తప్పుల గురించి మాట్లాడటం లేదు’ అని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా తీయించింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. దాని నుంచి బయట పడేసే పనిలో తామున్నామని స్పష్టం చేశారు. ‘సెక్రెటేరియట్ సీఎంకు ఇల్లు అయితే…వాళ్ళు ఉండేది ఫామ్ హౌసా? అని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు…దేశ వ్యాప్తంగా ఆర్ధిక పరిస్థితి ఇబ్బందికరంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అయిన ప్పటికీ తమ ప్రభుత్వం వనరులను పెంచడం ద్వారా నిధులు తెచ్చుకునే పనిలో ఉందని తెలిపారు. మావో యిస్టులతో తమ కుటుంబానికి అన్యాయం జరిగిం దని గుర్తు చేశారు. కానీ ఇంకో కుటుంబానికి అన్యా యం జరగొద్దనేది తమ ఆలోచన అని వ్యాఖ్యానిం చారు. వారు శాంతి చర్చలు కోరడం తప్పు కాదనీ, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే మావోయిస్టులతో చర్చలు జరిపిందని ఆయన గుర్తు చేశారు.
బీజేపీ నేతల అవివేకానికి నిదర్శనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES