Friday, March 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మొక్కల సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

మొక్కల సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
నర్సరీలో మొక్కల సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండలంలోని నాగపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీని ఆయన సందర్శించారు. వేసవి ఎండలు ముదిరినందున నర్సరీలో మొక్కల సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నర్సరీ నిర్వాహకులకు సూచించారు.

ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉదయం, సాయంత్రం రెండు విడతలుగా మొక్కలకు నీటిని అందించాలన్నారు. గ్రామంలో లక్ష్యం మేరకు నాటేందుకు అవసరమైన మొక్కల్ని సిద్ధం చేయాలన్నారు. నర్సరీలో సిద్ధం చేస్తున్న మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు.మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా తగిన జాగ్రత్తలు పాటించి నర్సరీని నిర్వహించాలని తెలిపారు.కార్యక్రమంలో సర్పంచ్ కంపదండి అశోక్,  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -