Tuesday, October 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులకు ఇబ్బంది కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి: కలెక్టర్

రైతులకు ఇబ్బంది కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి: కలెక్టర్

- Advertisement -

ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
నవతెలంగాణ – రామారెడ్డి

వాతావరణ శాఖ సూచన మేరకు తుఫాన్  వల్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని అన్ని వరి కొనుగోలు కేంద్రాల్లో  రైతులకు ఇబ్బంది కలగకుండా అవసరమైన ఏర్పాట్లను చేయాలని అధికారులకు, కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ సూచించారు. మంగళవారం మండలంలోని ఉప్పల్ వాయి కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ… ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లతో పాటు అవసరమైన సౌకర్యాలను వెంటనే వేగవంతం చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. రానున్న రోజుల్లో వర్ష ప్రభావంతో అవసరమైతే వరి కోతలు జరపకుండా రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని, కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు ధాన్యం పంపిన వెంటనే దిగుమతి చేసుకునేలా పర్యవేక్షణ జరపాలని సూచించారు.

కాంటావేసిన బస్తాలను సంరక్షించుకోవాలని సెంటర్ ఇన్చార్జి, లకు సంఘ కార్యదర్శులకు సూచించారు. కొనుగోలు కేంద్రం కు రైతులు తమ ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలు, తేమశాతం, తదితర నిబంధనలను పాటించాలని, రైస్ మిల్ వద్ద వడ్ల వడ్ల బస్తాలు దించుకున్న వెంటనే రిసిప్ట్ పొంది వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని సెంటర్ ఇన్చార్జిలకు సూచించారు. జిల్లాలో మొత్తం 427 కొనుగోలు కేంద్రాలు, 233 ఫాక్స్ కేంద్రాలు, 193 ఐకెపి కేంద్రాలు ఉన్నాయని, ఏ గ్రేడ్ క క్వింటాలుకు రూ 2389, సాధారణ రకం రూ 2369 ప్రభుత్వ మద్దతు ధర ఉన్నట్లు తెలిపారు. అనంతరం తాసిల్దార్ కార్యాలయాన్ని అకస్మికంగా తనిఖీ చేశారు.

భూభారతి రెవెన్యూ సదస్సులో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఎన్నికల నిబంధనల మేరకు శనివారంలోగా ఎఫ్ ఐ ఆర్ సమయానికి పూర్తి చేయాలని, ఎలాంటి లోపాలు లేకుండా నిబంధనల ప్రకారం  నిర్వహించాలని సూచించారు. 2002,  2025 ఓటర్ జాబితాను జాగ్రత్తగా సరిచేసుకొని ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నమూనా వివరాలు రూపొందించాలని, తప్పిదాలకు తావు లేకుండా మ్యాపింగ్ పూర్తి చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇంటి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ రవితేజ, డి ఆర్ ఓ మదన్ మోహన్, డిసిఒ రామ్మోహన్, క్లస్టర్ ఆఫీసర్ లక్ష్మణ్, తహసిల్దార్ ఉమాలత, ఎంపీడీవో నాగేశ్వర్, ఎంపీ ఓ తిరుపతిరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, కొనుగోలు కేంద్ర నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -