Friday, March 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అచ్చంపేటలో ఆస్తి పన్ను వసూలు వేగవంతం

అచ్చంపేటలో ఆస్తి పన్ను వసూలు వేగవంతం

- Advertisement -

నిధులు విడుదలకు అర్హత సాధిస్తా
మునిసిపల్ మేనేజర్ రమేష్ నాయక్
నవతెలంగాణ- అచ్చంపేట
2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను వసూలు చేయడానికి అచ్చంపేట మున్సిపల్ అధికారులు వేగవంతం చేస్తున్నారు. జి.ఎస్.డి టిల ప్రకారం ఆస్తి పన్ను 90 శాతం వసూలు చేస్తేనే ఈ ఏడాది 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం, మునిసిపల్ శాఖ  ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆస్తిపన్ను వసూలు చేయడానికి అచ్చంపేటలో పండుగ పూట కూడా మునిసిపల్ సిబ్బంది ఇంటింటికి  తిరుగుతున్నారు. అచ్చంపేట మున్సిపాలిలో ఈ నెల మార్చి 31 నాటికిరూ  31 లక్షలు ఆస్తిపన్ను వసూలు చేసి ప్రభుత్వం నుంచి మునిసిపాలిటీకి  నిధులు విడుదలకు అర్హత సాధించేందుకు కృషి చేస్తున్నామని మున్సిపల్ మేనేజర్ రమేష్ నాయక్ శుక్రవారం నవతెలంగాణతో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన భవనాల ఆస్తిపన్ను రూ.60 లక్షల రూపాయలు బకాయిలు ఉందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -