Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజిప్రవచనాలు

ప్రవచనాలు

- Advertisement -

ప్రతి హిందువు త్వరగా పెండ్లి చేసుకుని ముగ్గురు పిల్లల్ని కనాలని ప్రవచించారు. ఎందుకంటే జననాల రేటు తగ్గిపోతోందని, ఇలా తగ్గితే జాతి అంతరిస్తుందని చెప్పారు. జనాభా పెరుగుదల ఒక వరమని సెలవిచ్చారు. దేశంలో ముస్లింల, క్రిస్టియన్‌ల జనాభా కన్నా హిందువులు పెరగాలన్న కోర్కె ఇందులో ఉంది. మన జనాభా తరిగిపోవడం వల్లనే సమస్యలు తలెత్తుతున్నాయనే భావనను ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడున్న జనాభాకే కూడు, గూడు, బట్ట, ఉపాధి, విద్య, వైద్యం, ఉద్యోగం కల్పించలేని స్థితిలో అనేక బాధలతో జనం సతమతమవుతుంటే , నూట నలభై కోట్లకు పెరిగిన జనాభాతో ఉన్న ఇప్పుడు – ఈ పిలుపు ఇవ్వడం ఎంత మతితప్పిన వ్యవహారం!

ప్రవచనా ఘనుల గురించి మీరు వినే ఉంటారు. ఆధ్యాత్మికం మాటున చేసే ప్రవచనాల వెనకాల రాజకీయ లక్ష్యాలు, గమనాలు స్పష్టంగా ఉంటాయనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మన దేశంలో ముఖ్యంగా తెలుగు ప్రాంతంలో టీవీ చానెళ్లలో, సమావేశాల్లో, సభల్లో ప్రవచనాకారుల విజృంభణ విపరీతంగా మొదలైంది తొంభైలలోనే. అంటే అది ప్రపంచీకరణ, ప్రయివేటీకరణ విస్తృతమవుతున్న సందర్భం. ఆర్థిక వ్యవస్థలో సంక్షోభం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల అన్నీ పెరిగి ప్రజలు సతమతమవుతున్న సందర్భంలో ఈ ప్రవచనాలు విజృంభించాయి. ఈ లౌకిక సుఖాలు, సౌకర్యాలు, బాధలు మొదలైనవన్నీ కర్మఫలితాలనీ, వాటిని అనుభవించక తప్పదనీ, ఎదురయ్యే ఇక్కట్లను, ఏకాగ్రాతతో, ధ్యానంతో శ్వాసపై ధ్యాసతో ఎదుర్కోవాలని బోధించారు. ఈతిబాధలు సర్వసాధారణమని సెలవిచ్చారు. నిరుద్యోగుల మానసిక ఆందోళనలను యోగా ద్వారా పరిష్కరించుకోవాలని, ఆ ఆలోచనలన్నీటినీ ఆధ్యాత్మిక ఆధ్యయనం ద్వారానే ఎదుర్కోగలమని ప్రవచించారు. మనిషన్న వాడికి సమస్యలెదురవుతాయని, వాటి పరిష్కారం మనలో దాగి ఉంటుందని ప్రసార మాధ్యమాలు ఆనాడు ఏమిటి, ఇప్పటికీ ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నది. ఇదొక రకమైన ఆధ్యాత్మికత పేరున సాగిన పరిష్కార ఔషధగుళిక. బాబాలు, రాందేవ్‌లు, చాగంటి లాంటి నిత్యబోధకుల ఉపశమన బోధ కొనసాగిస్తూనే ఉన్నవి. అయితే వాస్తవిక జనజీవనం మరింత కష్టపూరితమవుతున్న విషయం గమనంలోకి వస్తున్నది.ఇక ఇప్పటి పరివారపు ప్రవచనాలు మనమీదికొస్తున్నాయి.

ప్రవచనాలన్నింటిలో భాగవత్‌ ప్రవచనం వేరయా! అని చెప్పుకోవచ్చు. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు ఏర్పడి వందేళ్లు అయిన సందర్భంగా శతాబ్ది ఉపన్యాసాల పరంపరలో ఇటీవల ఢిల్లీలో, దాని ఛీఫ్‌ మోహన్‌ భాగవత్‌ చేసిన ఉద్బోధ చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఇందులో మూడు విషయాలు వెల్లడించారయన. ఒకటి అబద్ధం, రెండు రాజీ పడటం, మూడు విద్వేషపూరిత పిలుపు, అశాస్త్రీయం. తానెపుడూ, పదవిలో ఉన్నవారు 75 ఏండ్లకు విరమణ పొందాలని ఎవరికీ సూచించలేదని, ఆయన చెప్పిన మాటనే తిరగేసి చెప్పారు. ఇపుడెందుకు మాట మార్చారంటే బహుశా రాజీ ఏదో కుదిరి ఉండవచ్చు. అందులోనే ఆయన కేంద్రంతో సంఘర్షణ ఉంది కానీ గొడవలేదని నుడివారు. ప్రభుత్వంలో మేం కలుగజేసుకోమని సెలవిచ్చారు. మాట మార్చడం, అసత్యాలు వల్లించడం వారికి వెన్నతో పెట్టిన విద్య. మొన్న స్వాతంత్య్ర దినోత్సవ ఉపన్యాసంలో ప్రధాని మోడీ సంఫ్‌ు పరివారాన్ని, వారి సేవాభావాన్ని, దేశభక్తిని ఆకాశానికెత్తిన కారణంగానే ఈ సంఘర్షణ గొడవగా మారలేదేమో! డెబ్బయి అయిదేండ్లు షరతు కూడా తూచ్‌ అయిపోయింది.

శత్రువు-శుత్రువుపట్ల ద్వేషం పెంచే సంఘీయుల వ్యూహంలో భాగమయిన ఆలోచనను,వారి ఛీఫ్‌ భాగవత్‌ ప్రవచనంగా ప్రభోధిస్తున్నాడు. ప్రతి హిందువు త్వరగా పెండ్లి చేసుకుని ముగ్గురు పిల్లల్ని కనాలని ప్రవచించారు. ఎందుకంటే జననాల రేటు తగ్గిపోతోందని, ఇలా తగ్గితే జాతి అంతరిస్తుందని చెప్పారు. జనాభా పెరుగుదల ఒక వరమని సెలవిచ్చారు. దేశంలో ముస్లింల, క్రిస్టియన్‌ల జనాభా కన్నా హిందువులు పెరగాలన్న కోర్కె ఇందులో ఉంది. మన జనాభా తరిగిపోవడం వల్లనే సమస్యలు తలెత్తుతున్నాయనే భావనను ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడున్న జనాభాకే కూడు, గూడు, బట్ట, ఉపాధి, విద్య, వైద్యం, ఉద్యోగం కల్పించలేని స్థితిలో అనేక బాధలతో జనం సతమతమవుతుంటే, నూట నలభై కోట్లకు పెరిగిన జనాభాతో ఉన్న ఇప్పుడు – ఈ పిలుపు ఇవ్వడం ఎంత మతితప్పిన వ్యవహారం! ముందుగా ఇప్పుడున్న జనాభా సమస్యలను తీరిస్తే, జనాభా పెంచే విషయం ఆలోచించవచ్చును.ఇక అసలైన విద్వేషాన్ని రెచ్చగొట్టే అంశం మధుర, కాశీలలో ముస్లింలు తమ మసీదులను హిందువులకు వదిలేయాలని కోరటం వివాదాన్ని రెచ్చగొట్టే వచనం. ఇది ప్రజల మధ్య చిచ్చుపెట్టే అతి దారుణమైన విషయం.
ఇవన్నీ మత ప్రాతిపదికన ఇస్తున్న పిలుపులు తప్ప, సమాజ శ్రేయస్సును కోరి చెబుతున్న బోధన కాదు. సామాజిక, ఆర్థిక శాస్త్రవేత్తలు జనాభా విషయంలో చేసిన విశ్లేషణలకు ఇది పూర్తి వ్యతిరేకమైనది.అలాగే మధుర, కాశీ దేవాలయాల సమస్యనూ ముందుకు తెచ్చి ప్రజల దృష్టిని మరల్చటం ఎన్నికల్లో లబ్ది పొందటం ఈ ఉద్భోదల వెనుక ఉన్న ఉద్దేశ్యం. అబద్ధాలు, అసత్యాలు, అసమంజస ప్రవచనాల పట్ల జాగ్రత్త వహించాలి. ఏ ప్రవచనాల వెనకాల ఏమి దాగుందో తెలుసుకుని మెదలాలి!

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad