- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల స్థాయిలో మండల మహిళా సమాఖ్య భవనాలు నిర్మించుకొనుటకు ఆసక్తి గలవారు అర్జెంటుగా ప్రతిపాదనలు సమర్పించాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మండల మహిళ సమాఖ్య భవనంలో అన్ని గ్రామాల వివోలతో సమావేశాన్ని నిర్వహించారు. ఉపాధి హామీ పథకం కింద గ్రామస్థాయి మహిళా సమాఖ్య భవనాలు, మండల స్థాయిలో మండల మహిళా సమాఖ్య భవనాలు నిర్మించుకొనుటకు ఆసక్తి ఉంటే వెంటనే ప్రతిపాదనలు అందజేయాలని సూచించారు.ఈ సమావేశంలో ఐకెపి ఎపిఎం కిరణ్ కుమార్, సీసీలు, గ్రామ సమైక్య సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



