Wednesday, July 30, 2025
E-PAPER
Homeజిల్లాలుదేవాలయ అసైన్డ్ భూములను రక్షించండి..

దేవాలయ అసైన్డ్ భూములను రక్షించండి..

- Advertisement -

సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మంత్రి సీతక్కకు వినతి
నవతెలంగాణ – కామారెడ్డి

కామారెడ్డి జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూములు, దేవాలయ భూములు, అసైన్డ్ భూములను కబ్జాల నుండి రక్షించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కే చంద్రశేఖర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల ప్రభుత్వ భూములు దేవాలయ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జాలు చేస్తూ వెంచర్ల ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. బిక్నూర్ సిద్ధ రామేశ్వర ఆలయానికి సంబంధించిన వెయ్యి ఎకరాల భూమి మాచారెడ్డి చౌరస్తా వెంకటేశ్వర ఆలయం భూములు, నగర రామయ్య భూములతో పాటు జంగంపల్లి గ్రామంలో 1200 ఎకరాల అసైన్డ్ భూమి కబ్జాకు గురివిందని దీనిని రక్షించాలని మంత్రి ని కోరడం జరిగిందన్నారు.

దేవాలయ భూముల ఆక్రమణల వెనక రాజకీయ పలుకుబడి ఉన్న నాయకులు ఉన్నారని, వారి చెర నుండి భూముల సర్వే చేసి కాపాడాలని అన్నారు.  జిల్లాలో చెరువులు, కుంటలు  కబ్జాలు చేస్తున్నారని జిల్లా అధికార యంత్రాంగం చూసి చూడనట్టు ఉంటుందని అన్నారు.  కామారెడ్డి జిల్లా కేంద్రంలో అశోక్ నగర్, పాతరాజంపేట్ దగ్గర రైల్వే బ్రిడ్జిలను ఏర్పాటు చేయాలని ఆటోనగర్ ఏర్పాటు కోసం స్థలం కేటాయించాలని అన్నారు.  జిల్లా కేంద్రంలో మధ్యలో ఆగిన సమీకృత మాంసం మార్కెట్ , కూరగాయల మార్కెట్ ని పున ప్రారంభించి త్వరితగతిన నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. వెంటనే పలు సమస్యలను పరిష్కరించాలని మంత్రి నీ కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్ గౌడ్, మోతీరామ్ నాయక్, కొత్త నరసింహులు, జిల్లా కమిటీ సభ్యులు ముదాం అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -