ఒకే రోజు 20 కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
నవతెలంగాణ – పాలకుర్తి
అనారోగ్యాలతో బాధపడుతూ ఇటీవలే మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలను, అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని 20 కుటుంబాలను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పరామర్శించారు. మైలారం గ్రామానికి చెందిన బానోతు యాదయ్య, గుగులోతు బాలు, గుగులోతు కేవు, మౌర్య లక్ష్మి, హరిజన కాలనీకి చెందిన మారపెల్లి కొమురయ్య, చీమల బావి తండా శివారు కుంతవత్ తండాకు చెందిన కుంతావత్ నంద, విసునూరు గ్రామానికి చెందిన కన్నా గట్టయ్య, లక్ష్మీనారాయణ పురం గ్రామానికి చెందిన గుండెవేని రంజిత్, బండిపెళ్లి నర్సమ్మ, ప్యారపు రామక్క, ఈరవెన్ను గ్రామానికి చెందిన మహమ్మద్ బిక్షపతి, గూడూరు గ్రామానికి చెందిన చింతల మల్లయ్య, పెద్ద తండా బి గ్రామానికి చెందిన లాకావత్ మోతి రామ్, లాకావత్ జాంకి, మల్లంపల్లి గ్రామానికి చెందిన చింతం వీరయ్య లు మృతి చెందడంతో ఎమ్మెల్యే మృతుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించి మృతుల కుటుంబాలను పరామర్శించి ఆదుకుంటానని భరోసా ఇచ్చారు.
ఈరవెన్ను గ్రామానికి చెందిన కూస స్వరూప బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతుండగా, గూడూరు గ్రామానికి చెందిన మాచర్ల రజిత, గుగ్గిళ్ళ కొమురయ్యలు అనారోగ్యంతో బాధపడడంతో బాధితులను పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలు శ్రమించారని తెలిపారు. కార్యకర్తలు మృతి చెందడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అన్నారు. కార్యకర్తల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయా గ్రామాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కార్యకర్తల కుటుంబాలను కంటికి రెప్పల కాపాడుకుంటా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES