Tuesday, September 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రకృతి రక్షణే-ప్రజల రక్షణ

ప్రకృతి రక్షణే-ప్రజల రక్షణ

- Advertisement -

– బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు విమలక్క
– ‘బహుజన బతుకమ్మ’ పోస్టర్‌ ఆవిష్కరణ


నవతెలంగాణ-హిమాయత్‌నగర్‌
‘ప్రకృతి రక్షణే-ప్రజల రక్షణ’ నినాదంతో బహుజన బతుకమ్మ-2025 సెప్టెంబర్‌ 20న ఉస్మానియాలో ప్రారంభమై అక్టోబర్‌ 3న నిజామాబాద్‌ జిల్లా ముప్పాల్‌ మండల కేంద్రంలో ముగుస్తుందని నిర్వహణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు విమలక్క తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ అమరుల స్మృతి కేంద్రం గన్‌పార్క్‌ వద్ద సోమవారం ‘బహుజన బతుకమ్మ’ వాల్‌ పోస్టర్‌, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమ పతాకగా అంది వచ్చిన బహుజన బతుకమ్మ 2010లో ప్రారంభమై 15 ఏండ్లుగా కొనసాగుతూ.. ప్రజా సమస్యలు లేవనెత్తుతున్నదని చెప్పారు. దాదాపు 12 కేంద్రాల్లో జరిగే ఈ కార్యక్రమంతోపాటు ప్రజలు, ప్రజాసంఘాలు ఈ అవగాహనతో ముందుకు వచ్చి బహుజన బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రకృతి, అడవులు, స్త్రీ రక్షణ, శాంతి స్వావలంబన, వ్యవసాయాన్ని చాటుతూ ‘బహుజన బతుకమ్మ’ జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్‌ లక్ష్మి, ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌ ఎనిశెట్టి శంకర్‌, ఆచార్య కట్టా భగవంత్‌రెడ్డి, టీపీటీఎఫ్‌ నాయకులు ప్రకాష్‌రావు, రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పట్లోళ్ల నాగిరెడ్డి, నాయకులు వెంకటేశ్వర్లు, ఏఐఎఫ్‌టీయు అధ్యక్షులు మల్లేశం, నాయకులు యాకయ్య, అరుణోదయ ప్రధాన కార్యదర్శి పోతుల రమేష్‌, కార్యదర్శి రాకేష్‌, పీడీఎస్‌ యు (విజృంభణ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లూరు విజరు, నాయకులు దిలీప్‌, పీఓడబ్ల్యు (స్త్రీ-విముక్తి) గంగారత్నం, సౌజన్య, సంతోషి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -