– సింగరేణి కాలరీస్ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డా.బుద్దప్రకాష్ జ్యోతి
– మణుగూరు ఏరియాలో పర్యటన
నవతెలంగాణ-మణుగూరు
రక్షణ, నాణ్యతకు పెద్ద పీట వేస్తూ నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని సింగరేణి చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డా.బుద్దప్రకాష్ జ్యోతి సూచించారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి ఏరియాలో డైరెక్టర్ (ఆపరేషన్) ఎల్.వి. సూర్యనారాయణ, డైరెక్టర్ (పీఅండ్‌పీ) కే.వెంకటేశ్వర్లు, ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్, సంబంధిత అధికారులతో కలిసి పీకే ఓసీ ఉపరితల గనుల్లో ఆయన పర్యటించారు. మొదటగా ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ మణుగూరు ఏరియా బొగ్గు ఉత్పతి,్త ఉత్పాదకతపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. పీకేఓసీ-2 గనిని సందర్శించి వ్యూ పాయింట్ ద్వారా బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఓసీ-2 క్వారీలో కోల్ బెంచ్ సందర్శించి సంబంధిత అధికారులతో యంత్రాల పని తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే షావెల్స్ భారీ యంత్రాల పని తీరుతో పాటు, పావెల్స్ ద్వారా బొగ్గు లోడింగ్ చేసే ప్రక్రియను పరిశీలించారు. ఓసీ-4 ఉపరితల గనిలో పని చేస్తున్న సర్ఫేస్ మైనర్ భారీ యంత్రం ద్వారా జరుగుతున్న బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. బొగ్గు నాణ్యతను పరిశీలించారు. వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సరఫరా చేయాలని అధికారులకు సూచనలు చేశారు. యంత్రాలను పూర్తి స్థాయిలో వినియోగించి, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలని సూచించారు. అలాగే 2025-26 సంవత్సరానికి నిర్దేశిత బొగ్గు ఉత్పత్తిని సాదించేందుకు ఉద్యోగులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీఎం(సీడీఎం) టి.శ్రీనివాస్, ఎస్‌ఓటు జీఎం బి.శ్రీనివాస చారి, పీఓ పీకేఓసీ ఎం.శ్రీరమేష్, ఏజెంట్ కొండాపురం వేణు మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
రక్షణ, నాణ్యతకు పెద్దపీట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



