నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో, యుఆర్ఎస్ లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మరియు సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కారించాలని టి ఎస్ యూ టి ఎఫ్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు లో భాగంగా జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన ప్రదర్శన చేసి జిల్లా కలెక్టర్ కి టీఎస్ యుటిఎఫ్ యాదాద్రి జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు ముక్కెర్ల యాదయ్య మెతుకు సైదులు, కేజీబీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ లక్ష్మి ల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మూడు దశల పోరాటాలలో భాగంగా ఈరోజు కేజీబీవీ, యుఆర్ఎస్ సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, 29 రోజుల సమ్మె కాలానికి వేతనాన్ని వెంటనే విడుదల చేయాలని, మినిమం టైం స్కేలు వర్తింపజేయాలని, కేజీబీవీ మహిళా ఉపాధ్యాయులకు చైల్డ్ కేర్ లీవ్ మంజూరు చేస్తూ, నైట్ డ్యూటీలను మినహాయింపు చేసి కేర్ టేకర్లను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈనెల 20 తారీకు లోపు ప్రభుత్వం స్పందించినట్లయితే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపడతామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఏ వెంకటాచారి, కేజీబీవీ జిల్లా కన్వీనర్ కే కవిత, యు ఆర్ ఎస్ నాయకులు యాకయ్య, ఎస్ ఎస్ ఏ నాయకులు నాగార్జున, పాండు, స్వామి, టీఎస్ యుటిఎఫ్ నాయకులు సుదర్శన్ రెడ్డి, డి వెంకన్న, డి రవి, అంజయ్య, ఎల్లయ్య, సోమయ్య, వెంకటేష్, నరసింహ, వివిధ విభాగాల ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


