- Advertisement -
– రుణమాఫీ, రైతు భరోసా అందించాలంటూ నినాదాలు
నవతెలంగాణ-దుబ్బాక
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేట వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసేందు కు వచ్చిన ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి నిరసన సెగ తగి లింది. మాజీ కౌన్సిలర్లు దివిటి కనకయ్య, బత్తుల స్వామితోపాటు పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఫ్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. దాంతో వారి వద్దకు వచ్చిన మంత్రి వివేక్.. రైతులకు ఇదివరకే రూ.2 లక్షల లోపు రుణాలను మాఫీ చేశామన్నారు. రానివారు ఉంటే వెంటనే అధికారు లను సంప్రదించాలని, వాటిని కూడా మాఫీ చేయిస్తామని హామీ ఇచ్చారు.
- Advertisement -



