Monday, April 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరేపు జిల్లా, డివిజన్‌ కేంద్రాల్లో నిరసన

రేపు జిల్లా, డివిజన్‌ కేంద్రాల్లో నిరసన

- Advertisement -

20న చలో అసెంబ్లీ
కేజీబీవీ, యూఆర్‌ఎస్‌, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి :టీఎస్‌యూటీఎఫ్‌ డిమాండ్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు (యూఆర్‌ఎస్‌), సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రెండో దశ ఆందోళనా కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా, డివిజన్‌ కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, ఎ వెంకట్‌ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

కేజీబీవీ, యూఆర్‌ఎస్‌, సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలనీ, వారి సర్వీసులను క్రమబద్దీకరించాలనీ, రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా సెలవులు ఇవ్వాలనీ, వార్షిక ఇంక్రిమెంట్‌ మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. మొదటి దశలో ఈనెల తొమ్మిదిన పాఠశాల స్థాయిలో నిరసన కార్యక్రమాలు నిర్వహించామని గుర్తు చేశారు. మూడో దశలో ఈనెల 20న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ వెంటనే చొరవ తీసుకుని వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -