నవతెలంగాణ – ఆర్మూర్ : పట్టణంలోని మాడ్రన్ బీడీ ఫ్యాక్టరీ చెందిన యజమాని పనిచేసిన కార్మికులకు అనేక నెలల నుండి వేతనాలు ఇవ్వకపోవడం వర్ధిపేర చేసుకున్న బీడీలకు రెండు సంవత్సరాలైనా వేతనాలు ఇవ్వకపోవడం నెలకు వారం లేదా పది రోజులు మాత్రమే పని ఇవ్వటం రాజీనామా చేసిన కార్మికులకు సంవత్సరాలు గడుస్తున్న గ్రాట్యూయిటి డబ్బులు ఇవ్వక పోవడం వలన తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ అధ్వారంలో గురువారం బీడీ కార్మికులతో ఫ్యాక్టరీ ముందు ధర్నా చేయటం జరిగింది. ధర్నా ఫలితంగా కంపెనీ మేనేజర్ తో చర్చలు జరిగినవి ఈనెల చివారిన బకాయి ఉన్న డబ్బులను చెల్లించుటకు అంగీకరించారు. మిగిలిన సమస్యలను మా యజమాన్యం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుటకు అమలు చేయుటకు సమయాన్ని కోరినారు. ఈ ధర్నా ను ఉద్దేశించి యూనియన్ జిల్లా అధ్యక్షులు బి సూర్య శివాజీ మాట్లాడుతూ.. కంపెనీ యజమాన్యం మొండిగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కార్మికుల అమాయకత్వాన్ని నిరాక్షరాసతను ఆసరా చేసుకుని కార్మిక చట్టాలను తమ చుట్టాలుగా మార్చుకొని శ్రమ దోపిడికి పాల్పడుతుందని ఆరోపించారు. అంతేకాకుండా లేబర్ అధికారులకు కంపెనీపై ఫిర్యాదు చేసి మూడు నెలలు గడుస్తున్నా యజమాన్యం పై చర్యలు తీసుకొని కార్మికులకు న్యాయం చేసే దాంట్లో విఫలమయ్యారని విమర్శించారు. ఇకనైనా కంపెనీ యజమాన్యం తమ మొండి వైఖరిని విడనాడి ఇచ్చిన హామీ ప్రకారం రాజీనామా చేసిన కార్మికుల గ్రాట్యూయిటి డబ్బులు ఇవ్వాలని కంపెనీ నెలకు 26 రోజులు నడిపించి ఇవ్వాలని బకాయి ఉన్న బట్వాడాలు వెంటనే ఇచ్చి నెల నెల వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు లేనియెడల కార్మికులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయవలసి వస్తుందని ఆపై జరిగే పరిణామాలకు కంపెనీయ పూర్తి బాధ్యత వాయించవలసి వస్తుందని హెచ్చరించారు.
ఇకనైనా లేబర్ అధికారులు తమ నిర్లక్ష్యాన్ని విడనాడి కంపెనీ యజమాన్యంపై తగు చర్యలు తీసుకొని కార్మికుల న్యాయం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీడీ కార్మికులు సమీరా ,లక్ష్మి, నర్సు, అరటి అనిత, అరస లక్ష్మి, బయ్యా అనూష, వేల్పూర్ చంద్రబాగ్ తదితరులు పాలుగోన్నారు.



