Thursday, September 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బకాయి వేతనాలు చెల్లించాలని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా..

బకాయి వేతనాలు చెల్లించాలని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
గ్రామపంచాయతీ కార్మికులకు దసరా పండుగ దగ్గరికి వచ్చిన నేటికీ బకాయి వేతనాలు చెల్లించడం లేదని గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గణపతి రెడ్డి సిఐటియు జిల్లా అధ్యక్షులు దాసరి పాండులు అన్నారు. గురువారం సిఐటియు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులకు బకాయిగా ఉన్న మూడు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని సమస్యలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించగా, ఆయన హాజరై,మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అన్నారు. గత ప్రభుత్వ హాయంలో కంటే ఎక్కువ బకాయిలుగా ఉంటుందని రెగ్యులర్ వేతనాలు చెల్లించడం లేదని అన్నారు.

గ్రామపంచాయతీ కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నదని ఏళ్ల తరబడిగా  ప్రజలకు అందుబాటులో ఉంటూ చేస్తున్న గ్రామాలను శుభ్రం చేస్తే ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్న గ్రామపంచాయతీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం ఉంటుందనీ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు సకాలంలో చెల్లించడం జరుగుతున్నదనీ అన్నారు. గ్రామపంచాయతీలో పనిచేసే గ్రామపంచాయతీ కార్మికులకు దసరా పండుగ దగ్గరికి వచ్చిన నేటికి బకాయిగా ఉన్న  వేతనాలు ఎందుకు చెల్లించడం లేదని తెలిపారు. గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మికులు అట్టడుగు వర్గాల కులాలకు సంబంధించిన పేదవారని ఇప్పటికే చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడతున్నారని అన్నారు.

దసరా పండుగ దగ్గరికి వచ్చిన వేతనాలు చెల్లించకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బకాయిగా ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని అన్నారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని  రెగ్యులర్ గా వేతనాలు చెల్లించాలని ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని ఆన్లైన్లో పేర్లు లేని కార్మికుల పేర్లను వెంటనే నమోదు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ మహిళా రాష్ట్ర కన్వీనర్ పొట్ట యాదమ్మ, జిల్లా కార్యదర్శి గడ్డం ఈశ్వర్, నాయకులు బొల్లేపల్లి స్వామి,  మంద యాదగిరి, కొండే నరసింహ, కిష్టయ్య, ఉపేందర్, భాస్కర్, రాము, శంకర్ , రమేష్, లక్ష్మి ,బుజ్జమ్మ లు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -