నవతెలంగాణ – పరకాల
ఆర్టీసీలో పనిచేసి పదవి విరమణ పొందిన ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పరకాల ఆర్టీసీ డిపో ఎదుట తెలంగాణ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి పరకాల డిపో కమిటీ అధ్యక్షులు బంక రవీందర్ మాట్లాడుతూ 2022 లో పదవి విరమణ పొందిన ఉద్యోగులకు ఇప్పటివరకు టర్మినల్ లీవ్ ఎన్కాష్మెంట్ చెల్లించ లేదన్నారు. అంతేకాకుండా 2017 సవరించిన వేతన ఒప్పందాల ప్రకారం రావాల్సిన బెనిఫిట్స్, సెటిల్మెంట్ ఎరియర్స్ వంటి అనేక ఆర్థిక ప్రయోజనాలు నెరవేరకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదురవుకుంటున్నారన్నారు. అతి తక్కువ వేతనాలతో ఆర్టీసీకి సేవలు అందించడం జరిగిందన్నారు.
ఆర్థికంగా అత్యంత దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నట్లు వెల్లడించారు. పదవి విరమణ పొందిన ఉద్యోగులకు అందాల్సిన ఆర్థిక బెనిఫిట్స్ అందకపోవడంతో కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలకు పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే ఆందోళన మరింత ఉధృతం చేయనున్నట్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సెక్రటరీ ఏ. తిరుపతిరెడ్డి, ట్రెజరర్ ఎండి షౌకత్ అలీ,జి. జనార్దన్,బి భద్రయ్య,సి హెచ్ మొగిలి, సంతోష్,బొంద్యాలు తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిపో ఎదుట ధర్నా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES