నవతెలంగాణ – నసురుల్లాబాద్
కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణను కోరుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో దానిని ఉపసంహరించుకోవాలని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నసురుల్లాబాద్ మండల కేంద్రంలో మంగళవారం బాన్సువాడ బోధన్ వెళ్లే రహదారిపై రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు, రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల టిఆర్ఎస్ నాయకుడు నర్సింలు గౌడ్ మాట్లాడుతూ కేటీఆర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండివైఖరికి నిరసనగా నేడు రాస్తారోకో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చారు. ఇందులో కనిసం 13 గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు కొట్లాడిన మహా నాయకుడు 10 సంవత్సరాలు దేశంలో అద్భుతమైన పరిపాలన అందించిన మహా నాయకుడు కెసిఆర్ పై సీబీఐ విచారణ కేసు వెనకకి తీసుకోకపోతే రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేను అడుగడుగునా అడ్డుకుంటామన్నారు. మండల పార్టీ తరపున హెచ్చరిస్తున్నామన్నారు . రాబోయే రోజుల్లో వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు నర్సింలు గౌడ్, టేకుర్ల సాయిలు, వెంకట్ సార్ గంపల శంకర్, అల్లం రాములు, గంగాధర్ లక్ష్మణ్, కనుకుట్ల శీను, రాజు, అంబర్ సింగ్ మంగళ సాయి, భూమయ్య, సాయిలు, రమేష్ కుమార్, బద్రి, దత్తు, పోచయ్య, శేఖర్, అక్తర్ గంగారం, షఫీ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.