Tuesday, January 20, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంప్రపంచ ఆర్థిక వేదికకు నిరసన సెగ

ప్రపంచ ఆర్థిక వేదికకు నిరసన సెగ

- Advertisement -

డబ్ల్యూఈఎఫ్‌ నియంతృత్వం కంటే ప్రజాస్వామ్యమే ముఖ్యం
స్విట్జర్లాండ్‌లో హౌరెత్తించిన నిరసనకారులు
ప్లకార్డులతో ప్రదర్శన..23 వరకు ప్రపంచ దేశాల నేతల భేటీ

బెర్న్‌ :”ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌)కు నిరసనల సెగ తగిలింది. సోమవారం నుంచి 23 వరకూ స్విట్జర్లాండ్‌లో ప్రపంచ దేశాల నేతలు భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో డబ్ల్యూఈఎఫ్‌ నియంతృత్వం కంటే ప్రజాస్వామ్యమే ముఖ్యం” అంటూ నిరసనకారులు హౌరెత్తించారు. వామపక్ష సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ యువజన విభాగం నేతృత్వంలో.. ఆగ్నేయ స్విట్జర్లాండ్‌లోని క్యూబ్లిస్‌ నుంచి పర్వత ప్రాంత రిసార్ట్‌ అయిన దావోస్‌ వైపు బయలుదేరారు. దాదాపు సగం మంది ప్రదర్శనకారులు స్విట్జర్లాండ్‌ నుంచి రాగా.. మరికొందరు ఇంగ్లాండ్‌, స్పెయిన్‌, దక్షిణ , పశ్చిమ ఆఫ్రికా, జర్మనీ నుంచి తరలివచ్చారు. పెట్టుబడిదారీ విధానానికి , వాతావరణ మార్పులను వేగవంతం చేస్తున్న యుద్ధాలకు ముగింపు పలకాలని, అలాగే అవసరాల ఆధారంగా ఆర్థిక వ్యవస్థను ప్రజాస్వామ్యీకరించాలని నిరసనకారులు పిలుపునిచ్చారు.

డబ్ల్యూఈఎఫ్‌ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పాల్గొనడం ఈ నిరసనకు మరింత ప్రాముఖ్యతను ఇచ్చింది. ”డబ్ల్యూఈఎఫ్‌ తన ఉనికికి గల కారణాన్ని కోల్పోయింది. ప్రపంచవ్యాప్తంగా పేదరికం , అసమానతలు పెరుగుతున్నాయి” అని ఆర్థిక విశ్లేషకులు తెలిపారు. స్విట్జర్లాండ్‌ ఆఫ్రికాకు కట్టుబడి ఉంది. కానీ అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా తమ దోపిడీకి విమర్శలు ఎదుర్కొంటున్న కంపెనీలకు కూడా ఇది నిలయంగా ఉందని వ్యాఖ్యానించారు. ”ఇది ఒక సందిగ్ధ పరిస్థితి. స్విట్జర్లాండ్‌లో తమ డబ్బును పెట్టుబడిగా పెట్టాలనుకునే వారికి స్విట్జర్లాండ్‌ స్పష్టమైన షరతులు విధించాలి. మానవ హక్కులను గౌరవించాలని డిమాండ్‌ చేయాలి” అని కోనే అన్నారు.

ట్రంప్‌ వ్యతిరేక నినాదాలు
ఒక ప్రదర్శనకారుడు అమెరికా అధ్యక్షుడిలా దుస్తులు ధరించి ”ప్రపంచ యుద్ధాలను మళ్ళీ గొప్పగా చేయండి” అనే సవరించిన శాసనం ఉన్న ”మాగా” టోపీని ధరించాడు. మరొక బోర్డుపై, ఒక మహిళ అమెరికన్‌ జెండాలు పట్టుకుని ”న్యూ మెక్‌ డోనాల్డ్‌ ట్రంప్‌-బర్గర్‌ పేదలను తింటారు” అనే నినాదంతో కూడిన స్వస్తికను అతికించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -