Wednesday, July 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఎమ్మెల్యే స్పందించాలని ఖమ్మం-వరంగల్ హైవేపై ధర్నా

ఎమ్మెల్యే స్పందించాలని ఖమ్మం-వరంగల్ హైవేపై ధర్నా

- Advertisement -

నవతెలంగాణ – వర్ధన్నపేట : వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో ఎస్బిఐ బ్యాంకు ముందు సైడ్ కాలువ లేకపోవడంతో ద్విచక్ర వాహనాలు జాతీయ రహదారిపై నిలుపుతున్నారని, స్థానిక బ్యాంకు బిల్డింగ్ యజమానితోపాటు వ్యాపార వర్గాల ప్రజలు ధర్నా చేశారు. వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్ సైడ్ కాలువ నిర్మించాలని అనేకసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవడంలేదని, కలెక్టర్కు కూడా విషయం తెలియజేశామని ఆందోళన చేశారు. ఈ ఆందోళనలతో 563 ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారిపై రోడ్డు కిరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఇప్పటికైనా వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు స్పందించి సైడ్ కాలువ సమస్య తీర్చాలని మండల వాసులు కోరారు.
ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేందుకు ఎస్సై చందర్ రాజోలు ఘటన స్థలానికి చేరుకుని ఆందోళనను విరమింప చేశారు. రహదారిపై ధర్నా అనుమతి లేకుండా చేశారని, వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ముందే చెప్పిన నవతెలంగాణ.. ఎస్బిఐ ముందు పొంచి ఉన్న ప్రమాదం.. సైడ్ కాలువ లేక ఇబ్బందులు. మున్సిపల్ అధికారులే కారణమా అనే ప్రత్యేక వార్త నవతెలంగాణ పత్రికలో ఫిబ్రవరి 14వ తేదీన ప్రచురించింది. అప్పటినుండి ఇప్పటివరకు మున్సిపల్ అధికారులు గానీ,  ప్రభుత్వం గానీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో, వర్షాకాలంలో రోడ్డుపై వ్యాపార వాణిజ్య సంస్థలు నుండి వచ్చే మురుగునీరు జాతీయ రహదారిపై ప్రవహిస్తుండడంతో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇది ఆర్టీసీ బస్టాండ్ పక్కనే ఉండడంతో బస్సులు మూలమలుపు తిరుగుతాయి. దీంతో ద్విచక్ర వాహనాలు హైవేపైనే నిలుపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించాలని స్థానికులు ఎమ్మెల్యేను కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -