నవతెలంగాణ-జక్రాన్ పల్లి
విద్యార్థుల కొరకు తారు రోడ్డును మరమ్మత్తులు చేయాలని ఆర్టీసీ బస్సులను ఆపివేస్తూ మండల కేంద్రానికి చెందిన వైయస్సార్ కాలనీ ప్రజలు రాస్తారోకో నిర్వహించారు. మండల కేంద్రంలోని జాతీయ రహదారి నుంచి మోడల్ స్కూల్ మీదుగా ముని పెళ్లికి వెళ్లే తారు రోడ్డును మరమ్మత్తులు చేపట్టాలని వైయస్సార్ కాలనీ ప్రజలు రాస్తారోకో చేపట్టారు. జాతీయ రహదారి నుంచి మోడల్ స్కూలు వరకు రోడ్డు గుంతల మయంగా మారి విద్యార్థులు ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు గుంతలలో పడి ప్రమాదం జరిగే అవకాశం ఉందని, రోడ్డంతా గుంతల మయంగా మారడంతో అతిపెద్ద భారీ వాహనాలు ఈ రోడ్డు వెంబడి ప్రయాణించడంతో రోడ్డు ఇంకా గుంతల మయంగా మారి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆరోపించారు. రాస్తారోకోను జక్రం పెళ్లి పోలీసులు పర్యవేక్షిస్తూ వైయస్సార్ కాలనీవాసులను తాసిల్దార్ కార్యాలయానికి ఎంపీడీవో కార్యాలయానికి తీసుకెళ్లి అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు జక్రాన్ పల్లి ఎస్ఐ ఎండి మాలిక్ తెలిపారు.
తారురోడ్డుకు మరమ్మత్తులు చేయాలని రోడ్డుపై నిరసన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES