నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల అర్బన్ పెద్దూర్‌లో ఉన్న మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. వారు తమ పిల్లలను మరో భవనంలోకి మార్చాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. పాఠశాల తంగళ్లపల్లి మండలం మండెపల్లి నుండి గత రెండు సంవత్సరాలుగా పెద్దూర్‌లోని అద్దె భవనంలో నడుస్తుందని, ఈ భవనంలో సరైన వసతులు లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో గదిలో 70 మంది వరకు విద్యార్థులను ఉంచుతున్నారని, దీని వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తల్లిదండ్రులు తెలిపారు. ఒక విద్యార్థికి జబ్బు చేస్తే, అది మిగతా వారికి కూడా వ్యాపిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సమస్యలను పరిష్కరించడానికి పాఠశాలను వెంటనే మరో భవనంలోకి మార్చాలని వారు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ చొరవ చూపి విద్యార్థులను సురక్షితమైన సౌకర్యవంతమైన భవనంలోకి మార్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు.
హాస్టల్ లో వసతులు కల్పించాలని రోడ్డుపై బైఠాయింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES