Monday, November 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్యం దుకాణం తొలగించాలని ధర్నా

మద్యం దుకాణం తొలగించాలని ధర్నా

- Advertisement -

–  తొలగించకపోతే ఇండ్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాం 
– ఉప్లూర్ రోడ్డులోని కాలనీ వాసుల హెచ్చరిక 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని ఉప్లూర్ రోడ్డులో నివాస గృహాల మధ్య ఉన్న మద్యం దుకాణం తొలగించాలని డిమాండ్ చేస్తూ కాలనీవాసులు సోమవారం ధర్నా చేశారు. మండల కేంద్రం నుండి ఉప్లూర్ వెళ్లేదారిలో గత కొన్ని సంవత్సరాలుగా మద్యం దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. మద్యం దుకాణం వల్ల కాలనీలో మహిళలు, పిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నామని వెంటనే మద్యం దుకాణాన్ని తొలగించడంతో పాటు వచ్చే నెలలో ఏర్పాటు చేసే కొత్త దుకాణాన్ని నివాస గృహాలకు దూరంగా తరలించాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా పలువురు కాలనీవాసులు మాట్లాడుతూ నివాస గృహాల మధ్య మద్యం దుకాణం పెట్టడం వలన చుట్టుపక్కల ఇండ్లలో ఉన్న మహిళలు, పిల్లలు రాత్రిపూట  బయటకు రావడానికి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం దుకాణం సమీపంలోనే మందుబాబులు మద్యం సేవిస్తూ వీరంగం సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నోసార్లు తాగిన మైకంలో పలువురి ఇండ్ల తలుపుల్ని కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు.ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణం మూలంగా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నామని, ఇకముందు నూతనంగా పెట్టే మద్యం దుకాణం  నివాస గృహాల మధ్య లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు విన్నవించారు. అధికారులు స్పందించని పక్షంలో తామే నివాస గృహాలను ఖాళీ చేసి వెళ్ళిపోతామని హెచ్చరించారు.కార్యక్రమంలో పసుపుల శైలజ, బాస అంజమ్మ, రాజు,లాండేరి రాజలింగం, కాలేరు గంగాధర్, పసుపుల చంద్రమోహన్, బాస మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -