Thursday, July 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రయివేట్ ఆస్పత్రిలో అబార్షన్లు ఘటనలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన..

ప్రయివేట్ ఆస్పత్రిలో అబార్షన్లు ఘటనలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి జిల్లా కేంద్రంలో నిన్న ప్రయివేట్ ఆస్పత్రిలో లింగ నిర్ధారణ, అబార్షన్లు చేసిన ఘటనలో నేరస్తులను వెంటనే విడుదల చేసినందుకు నిరసిస్తూ బిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపి,రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నిందితులకు వెంటనే శిక్షపడేలా చెయ్యాలని, ఇలాంటి సంఘటనలు పట్టణంలో మళ్లీ జరగకుండా చూడాలని నిందితులను కఠినంగా శిక్షించాలని, నిందితులను కొంత మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు , భువనగిరి శాసనసభ్యులు కాపాడడం జరిగిందని  ఆరోపించారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి నీ కలిసి ఇలా కొన్ని ప్రైవేటు ఆసుపత్రులలో లింగ నిర్ధారణ  అబార్షన్లు చేయడం జరుగుతుందనీ ఆస్పత్రులను కలెక్టర్,  డిహెచ్ఎంఓ లు పరిశీలించి అలాంటి ఆస్పత్రులపై తగు చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, బిఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి,రచ్చ శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీలు అతికిం లక్ష్మీనారాయణ గౌడ్, సూరపల్లి రమేష్, మాజీ జెడ్పిటిసి, సందెల సుధాకర్,నాయకులు ఇట్టబోయిన గోపాల్, కుశంగల రాజు, బర్రె రమేష్,తాడూరు బిక్షపతి, దొడ్డికాడి భగత్, కంచి మల్లయ్య, ఎక్బాల్ చౌదరి, బబ్లు, కాజం, కస్తూరి పాండు, ఇస్మాయిల్, ముజీబ్, అంజద్, రహీం,రత్నపురం పద్మ, ఇట్టబోయిన పావని, వనజ, అశోక్, సిల్వేరు మధు, ప్రవీణ్,పెంట నితీష్ నాగారం సూరజ్, చిన్న, షాగంటి నరసింహ, నాగరాజు, మనీష్, ఆమీర్, వినోద్, పవన్, పండు సైదులు, విక్రమ్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -