Wednesday, October 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళన..

ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళన..

- Advertisement -

– జస్టిస్ బి.ఆర్.గవాయ్ పై దాడి రాజ్యాంగంపై దాడే, భారతదేశానికి ఒక హెచ్చరిక..
– పెచ్చరిల్లుతున్న మనువాదాన్ని ఐక్యంగా పోరాడి అడ్డుకుందాం..
– దాడి చేసిన లాయర్ రాకేష్ కిషోర్ పై దేశ ద్రోహం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి..
– నిరసన కార్యక్రమంలో విద్యార్థి, దళిత, ప్రజా సంఘాల నేతలు..
నవతెలంగాణ – కామారెడ్డి 

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి ఆర్ గవాయ్ పై జరిగిన దాడి దేశ రాజ్యాంగంపై దాడే అని, ఈ దాడి దేశ భవిష్యత్తు పట్ల మతోన్మాదుల హెచ్చరికను తెలియజేస్తుందని విద్యార్థి, దళిత, ప్రజా సంఘాల నాయకులు విమర్శించారు. జస్టిస్ బీ.ఆర్.గవాయ్ పై జరిగిన మతోన్మాద దాడిని ఖండిస్తూ మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం  వద్ద విద్యార్థి, దళిత, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.

ఖబడ్దార్ అగ్రకుల మతోన్మాదుల్లారా అంటూ పెద్ద ఎత్తున  నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా  అధ్యక్షులు చంద్రశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా  కార్యదర్శి కొత్త నరసింహులు, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంగల వెంకటి, బిడిఎస్ఎఫ్  రాష్ట్ర నాయకులు  ఆజాద్, రైతు సంఘం నాయకులు మోహన్,  డివైఎఫ్ఐ నాయకులు రజినీకాంత్, ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి అరుణ్, నాయకులు రాహుల్, నవీన్,  ప్రముఖ న్యాయవాదులు క్యాతం సిద్ధిరాములు, అంబేద్కర్ సంఘం నాయకులు కొత్తపల్లి మల్లయ్య, రాజలింగం, బీసీ సంఘం నాయకులు, సాప శివరాములు, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ప్రకాష్ నాయక్, బుల్లెట్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -