- Advertisement -
నవతెలంగాణ – కాటారం
కాటారం మండలం రేగుల గూడెం (రేగుల గూడెం గ్రామపంచాయతీ) గ్రామానికి చెందిన మహిళలు బుధవారం గ్రామపంచాయతీ ఎదుట నీటి సమస్య పరిష్కరించాలంటూ, ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా నల్ల నీరు మురికిగా వస్తున్నప్పటికీ పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన గాని, పట్టించుకోవడంలేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మంచి నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
- Advertisement -