Monday, September 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యేకు ఉద్యమకారుల వినతి

ఎమ్మెల్యేకు ఉద్యమకారుల వినతి

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
మలిదశ తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో సోమవారం నాడు ఆలేరు మండలం మందనపల్లి క్రాస్ రోడ్ వద్ద ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య ను కలిసి వినతి పత్రం అందించారు. మలిదశ ఉద్యమకారుల వేదిక కన్వీనర్ మోరిగాడి వెంకటేష్ మాట్లాడుతూ .. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యమకారుల గురించి చర్చించాలని కోరినట్లు తెలిపారు. ఎమ్మెల్యే  దానికి స్పందనగా తప్పకుండా చర్చిస్తానని మీ హామీలు నెరవేర్చుటకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మలిదశ తెలంగాణ ఉద్యమకారుల వేదిక కన్వీనర్ మోరిగాడి వెంకటేష్ కో- కన్వీనర్ ఇక్కిరి శ్రీనివాస్ నాయకులు ఆడెపు బాలస్వామి ఎలగందుల సురేష్ కుడికాల భాను గుజ్జ అశోక్ సంఘీ నీలయ్య బందెల సుభాష్ ఎంఏ ఎజాజ్ కట్టెగొమ్ముల  సాగర్ రెడ్డి తదితరులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -