Monday, January 5, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంక్యూబాలో ఆందోళనలు

క్యూబాలో ఆందోళనలు

- Advertisement -

వెనిజులా కోసం త్యాగాలకు సిద్ధం : క్యూబా అధ్యక్షుడు డియాజ్‌ కానెల్‌

హవానా : అమెరికా దుర్మార్గానికి వ్యతిరేకంగా క్యూబ్యాలో ఆందోళనలు హోరెత్తాయి. అమెరికా రాయబార కార్యాలయం వద్ద ఆదివారం జరిగిన నిరసన కార్యక్రమంలో స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు మిగ్యుల్‌ డియాజ్‌ కానెల్‌ పాల్గోని మాట్లాడారు. వెనిజులా మా మిత్ర దేశమని క్యూబన్ల మద్దతు ఉంటుందని తెలిపారు. అమెరికా చేసింది అనాగరికమైన కిడ్నాప్‌ అని విమర్శించారు. ఇది ఉగ్రవాద చర్యగా పేర్కొన్నారు. అంతేకాదు గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్‌ జియోనిజం చేసిన నేరాలతో పోల్చదగినదని అమెరికాపై విరుచుకుపడ్డారు. వెనిజులాకు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. వెనిజులా కోసం, క్యూబా కోసం త్యాగాలకు, మా రక్తాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని డియాజ్‌ కానెల్‌ ప్రకటించారు.

అమెరికా అహంకార వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షడు ట్రంప్‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ క్యూబాను బెదిరించారు. క్యూబా అస్సలు బాగా లేదు అని, అది చాలా దారుణంగా విఫలమవుతున్న దేశం అని వ్యాఖ్యానించారు. అయితే, క్యూబాపై సైనిక చర్యను పరిశీలించడం లేదని, క్యూబా తనంతట తానుగా పతనం అవుతుండంటూ అహంకారంగా మాట్లాడారు. అలాగే క్యూబన్‌ వలసదారుల కుమారుడుగా చెప్పుకు తిరుగుతున్న విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో క్యూబా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నేను హవానాలో ఉండి, ప్రభుత్వంలో ఉంటే, చాలా ఆందోళన చెందుతానంటూ బెదిరించారు. అయితే ఈ వ్యాఖ్యలను క్యూబన్‌ ప్రభుత్వం ఖండించింది. త్యాగాలతో నిర్మించిన దేశం ఆగ్రరాజ్య బెదిరింపులకు లోంగిపోదని తెలిపింది.

ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
అమెరికా ఆంక్షలతో క్యూబా ఆర్థికంగా కుదేలవుతుంది. మదురో కిడ్నాప్‌ ప్రభావం క్యూబాపై పడనుంది. వెనిజులా నుండి రాయితీపై సరఫరా అయ్యే చమురు క్యూబాకు అత్యంత కీలకం. ఈ చమురు దేశంలోని విద్యుత్‌ వ్యవస్థను నడపడానికి ఎంతో సహాయపడుతుంది. చమురు సరఫరా తగ్గడంతో క్యూబాలో విద్యుత్‌ కోతలు పెరిగాయి. గత 14 నెలల్లో డజనుకు పైగా దేశవ్యాప్త విద్యుత్‌ అంతరాయాలు సంభవించాయి. హవానాలో ఇంధన కొరత స్పష్టంగా కనిపిస్తోంది. వెనిజులా క్యూబాకు చాలా సహాయం చేసిందని, ఆర్థిక సమస్యలు పెరుగుతున్నా అమెరికా దాష్టికాలకు వ్యతిరేకంగా క్యూబా నిలిచిందని పలువురు విశ్లేషిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -