సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అమెరికా, బ్రిటన్ దేశాలతో కేంద్ర ప్రభుత్వం చేసుకుంటున్న ద్వైపాక్షిక ఒప్పందాల వల్ల మన దేశ వ్యవసాయ రంగం, రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్‌రాములు తెలిపారు. ఈ ఒప్పందాలకు వ్యతిరేకంగా ఈనెల 13న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వారు విలేకర్లతో మాట్లాడారు. మరోవైపు ఈ ఒప్పందాలు జాతీయ ప్రయోజనాలను, ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తాయన్నారు. సామ్రాజ్యవాద శక్తులకు మోడీ ప్రభుత్వం లొంగిపోతోందని విమర్శించారు. గతంలో ఇటువంటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలన్నీ భారతీయ రైతులు, చిన్న పరిశ్రమలను తీవ్రంగా దెబ్బతీశాయని గుర్తు చేశారు. మాంసం, పాలకూర, పుట్టగొడుగులు, పుచ్చకాయలు, సీతాఫలం, మామిడి, మామిడి గుజ్జు, అరటిపండ్లు, కరివేపాకు, చింతపండు మొదలైన కూరగాయలు, పండ్ల ఉత్పత్తులు కూడా తీవ్ర ప్రభావాన్ని దెబ్బతీశాయని తెలిపారు. సుగంధ, ప్రాసెస్ చేసిన సుగంధ ద్రవ్యాలు, మొక్కజొన్న పిండి, రైస్ పిండి, బ్రౌన్ రైస్ పిండి, మొక్క జొన్న ఓట్స్, షుగర్ బీట్, తమలపాకులు, కోకో బీన్స్, కోకో పౌడర్, మాల్టెడ్ మిల్క్ తదితర ఉత్పత్తులు కూడా సుంకాల జాబితాలో ఉన్నాయని వారు పేర్కొన్నారు.
ద్వైపాక్షిక ఒప్పందాలకు వ్యతిరేకంగా 13న నిరసనలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES